Bikes and Cars: ఓవైపు జీఎస్టీ 2.0 కారణంగా.. మరోవైపు పండుగల సీజన్ ఆఫర్ల సందర్భంగా వాహనాల ధరలు తగ్గుతున్నాయి అన్న సంతోషం వ్యక్తమవుతున్న తరుణంలో వినియోగదారులకు షాకింగ్ న్యూస్ అందుతుంది. ముఖ్యంగా కొత్తగా వాహనాలు కొనేవారికి అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. తాజాగా ప్రభుత్వం కొత్తగా కొని వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కొత్తగా ఒరేయ్ వాహనాలపై లైఫ్ టాక్స్, ఇన్సూరెన్స్ ఉండేది.. కానీ కొత్తగా దీనిని అమలు చేయడంతో బైక్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ టాక్స్ ద్విచక్ర వాహనాలతో పాటు ఫోర్ వీలర్ పై కూడా వసూలు చేయనున్నారు. అయితే వ్యవసాయ ట్రాక్టర్లు, ఆటోలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అసలు ఈసెస్ అంటే ఏమిటి?
ప్రభుత్వం వాహనాలపై లేదా వాహన ఇంధనంపై వసూలు చేసే ప్రత్యేక పన్నును రోడ్ సేఫ్టీ సెస్ అంటారు. ఇది సాధారణ పన్ను వలె కాకుండా.. ప్రత్యేక అవసరాల కోసం దీనిని వసూలు చేస్తారు. ప్రస్తుతం దీనిపై వచ్చే పన్ను రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా కొని ద్విచక్ర వాహనాలపై రూ.2,000.. లైట్ వెహికల్ మోటార్స్ కు రూ.5,000.. ఇతర వాహనాలకు రూ.10,0000 వసూలు చేస్తారు. ఇలా అన్ని వాహనాలపై ప్రతి ఏడాది రూ. 270 కోట్లు వస్తాయని అంచనా వేశారు.
రోడ్డు భద్రత అవసరాలు అంటే వీటిపై వసూలు చేసే పన్నును రోడ్డు ప్రమాదాలను తగ్గించే వాటికి ఉపయోగిస్తారు. అలాగే రోడ్డు భద్రత చర్యలపై అవగాహన కలిగించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైవేలు, రోడ్ల నిర్మాణం మరియు మరమ్మతులు చేపడతారు. ప్రమాదాలు తగ్గించేందుకు సైన్ బోర్డులు, సిగ్నల్స్ వంటివి ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రమాద బాధితులకు సహాయం చేస్తారు.
ఈ రోడ్ సేఫ్టీ సెస్ సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా దసరా దీపావళికి వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఓవైపు జీఎస్టీ 2.0. సవరణ సందర్భంగా వాహనాలపై భారీగా తగ్గుతున్నట్లు ప్రకటించారు. కొన్ని కంపెనీలు అయితే తాము ఎంత తగ్గిస్తున్నామో కూడా టేబుల్స్ తో సహా రిలీజ్ చేశాయి. మరికొన్ని కంపెనీలు తాము ఎంత తగ్గిస్తున్నామో కూడా చెప్పాలి. కానీ ఇప్పుడు కొత్తగా రోడ్ సేఫ్టీ సెస్ విధిస్తుండడంతో.. ధరలు ఎలా పెరుగుతాయని కొనుగోలుదారులు ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్స్ సేఫ్టీ సెస్ పై మంత్రి వర్గం ఆమోదం కూడా పొందింది.