Best buys under GST 2.0: GST 2.0. కారణం.. పండుగల సీజన్ రావడం.. వినియోగదారులకు ఒకేసారి పంట పండినట్లు అయిపోయింది. ఎందుకంటే కొన్ని వస్తువులపై జిఎస్టి 12% నుంచి 5%.. 18% నుంచి 12%.. ఇలా తగ్గడంతో వస్తువుల ధరలు చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. మరోవైపు పండుగల సీజన్ కారణంగా కొన్ని కంపెనీలు వస్తువులను ఆఫర్ పై విక్రయించే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులు సెప్టెంబర్ 22 నుంచి వస్తువుల కొనుగోలుకు సిద్ధమయ్యారు. అయితే ఇలాంటి సమయంలో ఏ వస్తువులు కొనుగోలు చేయాలి? అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. వాస్తవానికి కొందరు కార్లు, బైక్ లు కొనాలని చూస్తారు. కానీ వాటికంటే ఈ సమయంలో 90% తగ్గింపు ధరలతో ఇచ్చే వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. మరి అలాంటి వస్తువులు ఏవి ఉన్నాయి?
సెప్టెంబర్ 22 అర్ధరాత్రి 12 నుంచి జీఎస్టీ 2.0 అమలు కాబోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు గ్రేట్ ఇండియన్ సేల్స్ , బిగ్ సేల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ సేల్స్ ప్రకారం కొన్ని వస్తువులపై భారీ తగ్గింపును ప్రకటించే అవకాశం ఉంది. ఉదాహరణకు ఏసీలు, ఫ్రిజ్లు, మొబైల్స్ వంటి వాటిపై 90% తగ్గింపు ధరలు ఉండే అవకాశం ఉంది. రూ. 13 వేల ఫోన్ రూ. 1300 లకు వచ్చే అవకాశం ఉంది. అలాగే లేడీస్ కుర్తా రూ. 10 నుంచే విక్రయిస్తుంటారు. ఇలా ఎన్నో రకాల వస్తువుల ధరలు భారీ తగ్గింపు ఉంటాయి. అయితే ఈ ఆఫర్ గురించి పూర్తిగా తెలియాలంటే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది దసరా, దీపావళి సందర్భంగా ఈ రెండు సంస్థలు సేల్స్ ను తీసుకొస్తాయి. కానీ ఈసారి జీఎస్టీ భారీగా తగ్గడంతో వస్తువుల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. అందువల్ల సెప్టెంబర్ 22 నుంచి వస్తువులు కొనే ఏర్పాటు చేసుకోవచ్చు.
చాలామంది దసరా, దీపావళి సందర్భంగా షాపింగ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా కొన్ని క్రెడిట్ కార్డులపై కూడా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. హలో మరింత ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా మొబైల్స్ పై ధరలు విపరీతంగా తక్కువగా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో సంస్థల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. ఇలాంటి సమయంలోనే కొన్ని ఫేక్ లింక్స్ కూడా ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని షాపింగ్ చేయడం మంచిదని అంటున్నారు.