History of alcohol drinking: ఒకప్పుడు మద్యం పరిమిత స్థాయిలోనే లభ్యమయ్యేది. సంప్రదాయ పద్ధతిలో మద్యాన్ని తయారు చేసేవారు. కొంతమంది మాత్రమే మద్యాన్ని విపరీతంగా తాగేవారు. సంప్రదాయ పద్ధతిలో మద్యాన్ని తయారు చేసేవారు కాబట్టి ఆరోగ్యాలు కూడా అంతగా పాడయ్యేవికావు. కొంతకాలానికి మద్య నిషేధం అమలులోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు మద్యానికి విపరీతంగా ప్రాధాన్యం ఇవ్వడంతో అది కాస్త ఒక వ్యాపారం లాగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాలకు మద్యం కాసులు కురిపించే మంత్రం అయిపోయింది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో మద్యం విక్రయించక తప్పడం లేదని ప్రభుత్వం అంటోంది. పైగా ఏ టికెట్ ధరలను విపరీతంగా పెంచుతుంది. మద్యానికి అలవాటుపడ్డ ప్రాణాలు వదులుకోలేవు కాబట్టి ఎంత ధర చెల్లించయినా సరే తాగుతూనే ఉన్నారు. ఒక రకంగా ప్రభుత్వాలు పేదల రక్త మాంసాల మీద వ్యాపారం చేస్తున్నట్టు లెక్క.
మద్యం అనేది ఎవరికి అలవాటుగా మారదు. ఏదో ఒక సందర్భంలో మద్యం తాగడం.. అది కాస్త అలవాటుగా మారడం.. చివరికి వ్యసనంగా రూపాంతరం చెందడం పరిపాటిగా మారిపోతుంది. మద్యం వ్యసనం అయినవారు ఇదే మాట చెబుతుంటారు. వాస్తవానికి మద్యం వల్ల ఆరోగ్యాలు పాడవుతుంటాయి.. అంతర్గత అవయవాలు క్షీణిస్తుంటాయి. అలాంటప్పుడు సాధ్యమైనంతవరకు మద్యం అలవాటును మానుకోవడమే మంచిది. కాకపోతే మద్యం తాగేవారు ఈ అలవాటుకు దూరంగా ఉండలేరు. చివరికి ఆరోగ్యం పాడై కన్నుమూస్తుంటారు. ఇటీవల కాలంలో మద్యం వల్ల చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయినప్పటికీ చాలామంది ఆ అలవాటు మానుకోవడం లేదు.
వాస్తవానికి మద్యం అనేది మత్తు ఇస్తుంది. ఆ మత్తు కోసం చాలామంది వెంపర్లాడుతుంటారు. వాస్తవానికి మనిషికి ఆల్కహాల్ కు లక్షల సంవత్సరాల క్రితమే సంబంధం ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అడవి చింపాంజీలు రోజు ఒక బాటిల్ బీరు మోతాదులో పులిసిన పండ్లను తింటాయట. క్రమంలోనే పూర్వీకుల నుంచే మనిషికి మద్యంపై ఆసక్తి ఏర్పడి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పండ్లలోని చక్కెర.. ఆల్కహాల్ చింపాంజీలకు ఆహార వనరులుగా ఉపయోగపడ్డాయి. ఇలా పులిసిన పండ్లను తినడం వల్ల చింపాంజీలు కూడా ఆరోగ్యంగా ఉండేవి. ఉత్సాహంగా ఆహార సేకరణ సాగించేవి. అడవిలో కూడా వేగంగా తిరిగేవి. క్రమక్రమంగా మనుషులకు కూడా అదే అలవాటు వచ్చి ఉంటుందని.. ఆల్కహాల్ మీద ఆసక్తి ఏర్పడేందుకు కారణం కూడా అదే అయి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.