MPV Cars 2024: ఒకప్పుడు కారు కొనాలనుకునేవారు ఫ్యామిలీకి సరిపోయే విధంగా తక్కువ బడ్జెట్ లో హ్యాచ్ బ్యాక్ కార్లను మాత్రమే తీసుకునేవారు. కానీ ఇప్పుడు లాంగ్ ట్రిప్ వేయడానికి, పలు అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండే MPV(Multi Purpose Vehicle) ల కోసం చూస్తున్నారు. గతంలో MPV వేరియంట్ లో ఎన్నో కార్లు వచ్చాయి. కానీ టయోటా కు చెందిన ఇన్నోవా మాత్రమే ఆదరణ పొందింది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎంపీవీల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా MPV లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 2024 కొత్త సంవత్సరంలో కొన్ని కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. వీటిలో నాలుగు ప్రధాన కంపెనీలు MPVలను తీసుకొస్తున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..
తక్కువ బడ్జెట్ లో కారు కావాలంటే మారుతి సుజుకీ వైపు మొదట చూస్తారనే వాదన ఉంది. కానీ మారుతి MPV లపై కూడా ఫోకస్ పెడుతోంది. లేటేస్టుగా ఈ కంపెనీ మినీ ఎంపీవీని అందుబాటులోకి తీసుకొస్తుంది. జపాన్ కు చెందిస స్పెస్ సుజుకీతో కలిసి ‘YDB’ ని తయారు చేస్తున్నారు. ఇది చిన్నపాటి బస్సులాగా కనిపిస్తుంది. దీని పొడవు 4 మీటర్లు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో ఉన్న ఇది బాక్సీ షేప్ ను కలిగి ఉంటుంది. దీనిని 2026 నాటికి భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.
భారతీయ ఆటోమోబైల్ మార్కెట్లో ఆదరణ ఉన్న కార్ల కంపెనీల్లో రెనాల్ట్ ఒకటి. దీని నుంచి రిలీజ్ అయిన ట్రైబర్ ను ఫేస్ లిప్ట్ గా అప్డేట్ చేసి విడుదల చేయనున్నారు. ఇది 1.0 లీటర్ 3 సిలిండ్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కంట్రోల్ సిస్టమ్ ను కలిగి ఉంది. సీట్ బెల్ట్ రిమైండర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆప్షన్లను కొత్తగా అమర్చారు. నిన్సాన్ కు చెందిన మరో మోడల్ రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా కొత్త ఎంపీవీని తీసుకొస్తున్నారు. ఇది కూడా 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో మాన్యువల్ తో పాటు ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. దీనిని ఈ ఏడాదిలో రిలీజ్ చేయనున్నారు.
సౌత్ కొరియాకు చెందిన కియా కంపెనీ నుంచి రిలీజ్ అయిన కార్నివాల్ హైబ్రిడ్ ఇంజిన్ తో కొత్తగా అందుబాటులోకి రానుంది. ఇది 1.6 లీటర్ టర్బో ఇంజిన్ తో పాటు అప్డేట్ చేసి రియర్ బంపర్, ఎల్ ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన కొత్త హెడ్ ల్యాంపులు ఉన్నాయి. ఇందులో కొత్త డ్యాష్ బోర్డ్, 14.6 ఇంచెస్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆకర్షిస్తుంది.