Up Coming Cars : భారతదేశంలో వచ్చే నెలలో కొన్ని అద్భుతమైన కార్లు విడుదల కాబోతున్నాయి. ఈ కార్లు మీ బడ్జెట్‌లోనే ఉంటాయి. ఎక్కువ మంది కొనే కార్లు ఇవే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విడుదల కాబోయే కార్లలో ఎలక్ట్రిక్ SUV, 7 సీటర్, హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ అన్నీ ఉన్నాయి.
ఎంజీ విండ్‌సర్ ఈవీ
ఎంజీ విండ్‌సర్ ఈవీని 50 kWh బ్యాటరీతో విడుదల చేయబోతోంది. ఇప్పుడు ఇది 461 కిమీ వరకు రేంజ్‌ను అందించగలదు. అయితే, కంపెనీ ఖచ్చితమైన తేదీని వెల్లడించలేదు. కానీ మే మొదటి లేదా రెండో వారంలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. 6 నెలల క్రితం విడుదలైన విండ్‌సర్ ఈవీ భారతదేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కారు. ప్రస్తుత 38 kWh మోడల్‌లో దాదాపు 300 కిమీల రేంజ్ లభిస్తుంది. దీని ధర రూ.14 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది.
Also Read : బ్యాంక్ బ్యాలెన్స్ రెడీగా ఉంచుకోండి.. త్వరలో మార్కెట్లోకి 4కొత్త ఎలక్ట్రిక్ కార్లు
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్
టాటా మోటార్స్ తన క్రాస్‌ఓవర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ దీనిని మే 21న విడుదల చేయనుంది. కొత్త టాటా ఆల్ట్రోజ్‌లో కొత్త డిజైన్, కొత్త ఫీచర్లతో సహా అనేక పెద్ద మార్పులు చూడవచ్చు. విడుదలైన తర్వాత ఈ కారు మారుతి బాలెనో, మారుతి స్విఫ్ట్‌లకు నేరుగా పోటీనిస్తుంది. కొత్త ఆల్ట్రోజ్ ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ సేఫ్ గా ఉండవచ్చు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు రావొచ్చు. రాబోయే కారు అంచనా ధర రూ.7 నుండి రూ.11 లక్షల మధ్య ఉండవచ్చు.
2025 కియా కారెన్స్
కియా తన పాపులర్ MPV కారెన్స్ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను మే 8, 2025న విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 2022లో విడుదలైన ప్రస్తుత కారెన్స్ భారతీయ మార్కెట్‌లో బాగా పాపులర్ అయింది. అయితే, రాబోయే ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్‌ను భర్తీ చేయదు. బదులుగా ఇది కారెన్స్ పేరుతో కొత్త మోడల్‌గా ప్రత్యేక వేరియంట్‌గా కంపెనీ అందిస్తుంది. ప్రస్తుత వెర్షన్‌తో పాటు అమ్ముడు పోనుంది. దీని అంచనా ధర రూ.11 లక్షల నుండి ప్రారంభం కావచ్చు.
Also Read : కొత్త ఎస్యూవీ కొనాలని చూస్తున్నారా..అయితే త్వరలో రాబోతున్న ఫ్యామిలీ కార్లు ఇవే