Incognito Mode History : ప్రస్తుతం ఇంటనర్నెట్ వాడకం పెరిగిపోయింది. ప్రతి రోజూ మనమందరం ఇంటర్నెట్‌లో ఏదో ఒక విషయం వెతుకుతూనే ఉంటాం. ఒకవేళ మీ బ్రౌజర్ హిస్టరీని వేరే ఎవరూ చూడకూడదనుకుంటే దాని కోసం ఇన్కాగ్నిటో మోడ్‌ను ఉపయోగిస్తుండొచ్చు. కానీ కేవలం ఇన్కాగ్నిటోలో బ్రౌజ్ చేయడం సరిపోతు. క్రమం తప్పకుండా హిస్టరీని డిలీట్ చేయాలి. దీన్ని పట్టించుకోకపోతే మీ ప్రైవసీకి ప్రమాదం ఏర్పడవచ్చు. ఇన్కాగ్నిటో మోడ్ హిస్టరీని ఒక్క క్లిక్‌తో ఎలా డిలీట్ చేయాలో ఈ కథనంలో తెలుసకుందాం.
Also Read: ఎలాన్ మస్క్.. మూడు దేశాల నుంచి ప్రపంచ కుబేరుడి ఒడిలోకి..
ఇన్కాగ్నిటో మోడ్ ఏం చేస్తుంది?
మీరు Chrome లేదా మరే ఇతర బ్రౌజర్‌లో ఇన్కాగ్నిటో మోడ్‌ను ఓపెన్ చేసినప్పుడు బ్రౌజింగ్ హిస్టరీ సేవ్ కాదు. కుకీలు, సైట్ డేటా సేవ్ కావు. ఏ ఫారమ్‌లలో నింపిన సమాచారం కూడా సేవ్ కాదు. ఇన్కాగ్నిటో మోడ్ అంటే మిమ్మల్ని ఎవరూ చూడడం లేదని కారు. మీ కార్యకలాపాలను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP), ఆఫీస్ నెట్‌వర్క్ లేదా కొన్ని ఎక్స్‌టెన్షన్‌ల ద్వారా చూడవచ్చు.
ఇన్కాగ్నిటో మోడ్ హిస్టరీ సేవ్ అవుతుందా?
టెక్నికల్ గా ఇన్కాగ్నిటో మోడ్‌లో బ్రౌజర్ దానిని సేవ్ చేయదు. కానీ ఏదైనా వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి ఉంటే ఆ వెబ్‌సైట్ మీ కార్యకలాపాలను ట్రాక్ చేస్తుంది. కొన్ని బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లు మీ కార్యకలాపాలను లాగ్ చేయగలవు. DNS కాష్‌లో కూడా మీ బ్రౌజింగ్ హిస్టరీ కొద్దిగా సేవ్ అవుతుంది.
మొదట మీ ఫోన్‌లో గూగుల్‌కు వెళ్లాలి. ఆ తర్వాత గూగుల్ సెర్చ్‌బార్‌లో ఇన్కాగ్నిటో మోడ్‌ను ఓపెన్ చేయాలి. ఇన్కాగ్నిటో మోడ్‌లో ఈ లింక్‌ను కాపీ పేస్ట్ చేయండి: chrome://net-internals. ఇప్పుడు మీ ముందు కనిపించే మొదటి సజెషన్ పై క్లిక్ చేయండి.
ఎడమ వైపు DNS ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. కుడి వైపున కనిపించే క్లియర్ హోస్ట్ కాష్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే మీ ఇన్కాగ్నిటో మొత్తం హిస్టరీ డిలీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ విధానాన్ని అర్థం చేసుకనేందుకు ఈ వీడియో ఫాలో అవ్వండి.
ఇన్కాగ్నిటోలో ఏదైనా తప్పు లేదా పెద్దల కంటెంట్‌ను సెర్చ్ చేస్తున్నారని.. మిమ్మల్ని ఎవరూ ట్రాక్ చేయలేరని మీరు అనుకుంటే అది నిజం కాదు. ఇన్కాగ్నిటో మోడ్‌లో కూడా మిమ్మల్ని ట్రాక్ చేయవచ్చు.
Also Read: కేటీఎంకి మళ్లీ షాక్.. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచివేత