CCMB Recruitment 2021: సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 1,14,151 రూపాయల నుంచి 2,12,421 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 11 చివరితేదీగా ఉంది.
హార్డ్ కాఫీలను పంపించటానికి 2021 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీ చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీల గురించి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మొదట ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత ఆఫ్ లైన్ లో దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్, సీఎస్‌ఐఆర్- సీసీఎంబీ, ఉప్పల్ రోడ్, హబ్జిగూడ, హైదరాబాద్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 32 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
మొత్తం 8 ఉద్యోగ ఖాళీలలో సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీ 1, సీనియర్ సైంటిస్టులు ఉద్యోగ ఖాళీలు 2, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టుల ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు లైఫ్ సైన్స్ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేసి ఉండాలి. పోస్ట్ డాక్టరోల్ విభాగంలో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం.
https://www.ccmb.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. భారీ వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.