Toyota Fortuner : భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో టయోటా ఫార్చ్యూనర్ ఒకటి. ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో మెకానికల్ అప్‌గ్రేడ్‌లతో అందుబాటులోకి వచ్చింది. టయోటా ఫార్చ్యూనర్ లైనప్‌లో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V (Fortuner Neo Drive 48V)ను రిలీజ్ చేసింది. ఈ 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V, లెజెండర్ నియో డ్రైవ్ 48V ప్రవేశపెట్టారు. డిజైన్, ఫీచర్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. కానీ కొన్ని కీలకమైన మెకానికల్ మార్పులు ఈ కొత్త మోడళ్లను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్
కొత్త టయోటా ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48Vలో అదే 2.8-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఇస్తుంది. అయితే, ఈ ఇంజిన్‌ను ఇప్పుడు 48-వోల్ట్ సిస్టమ్‌తో రాబోతుంది. ఇందులో బెల్ట్-ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, లిథియం-అయాన్ బ్యాటరీ (Lithium-ion Battery) ఉన్నాయి. ఈ హైబ్రిడ్ అసిస్ట్ స్మూత్ లో-ఎండ్ యాక్సిలరేషన్, మెరుగైన డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్, బెస్ట్ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్
ఈ హైబ్రిడ్ ఫార్చ్యూనర్‌లో అమర్చిన బ్యాటరీని డీయాక్సిలరేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా ఛార్జ్ చేస్తారు. ఈ టెక్నాలజీలో ఎస్‌యూవీ వేగం తగ్గినప్పుడు లేదా బ్రేక్ వేసినప్పుడు బ్యాటరీ ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవ్వడం ప్రారంభమవుతుంది. అలాగే, కొత్త స్మార్ట్ ఐడిల్ స్టార్ట్-స్టాప్ ఫంక్షన్ ఫ్యూయెల్ కెపాసిటీ మరింత మెరుగుపరుస్తుంది. వాహనం ఆగి ఉన్నప్పుడు ఇంజిన్‌ను ఆపివేయడం ద్వారా కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో పాటు ఇది మల్టీ-టెర్రెన్ సెలెక్ట్ సిస్టమ్ (Multi-Terrain Select System)తో కూడా వస్తుంది. ఇది వివిధ అన్ని రకాల రోడ్ల మీద మంచి డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
Also Read : రూ.50వేలకే ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరిగే కారును సొంతం చేసుకోవచ్చు
టయోటా ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V రెండు మోడళ్లలో అందుబాటులో ఉంది:
ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V: ఎక్స్-షోరూమ్ ధర రూ.44.72 లక్షలు.
లెజెండర్ నియో డ్రైవ్ 48V: ఎక్స్-షోరూమ్ ధర రూ.50.09 లక్షలు.
ఈ కొత్త 48V వేరియంట్ ఫార్చ్యూనర్ లైనప్‌లో రెండో అత్యంత ఖరీదైన వేరియంట్. అయితే లెజెండర్ సిరిసులో 48V మోడల్ అత్యంత ఖరీదైనదిగా మారింది.
డిజైన్, ఇంటర్నల్ ఫీచర్లు
టయోటా ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో తెలుపు, నలుపు రంగుల డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్, షార్ప్ హెడ్‌ల్యాంప్ DRLలు (డేటైమ్ రన్నింగ్ లైట్స్), ప్రత్యేక బంపర్, రెగ్యులర్ ఫార్చ్యూనర్‌తో పోలిస్తే మరికొన్ని కాస్మెటిక్ మార్పులు ఉన్నాయి. ఇందులో 20 ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.
ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో కూడా ఎటువంటి మార్పులు లేవు. ఇందులో డ్యూయల్-టోన్ ఇంటీరియర్, లెదర్ అప్హోల్స్టరీ, యాంబియంట్ లైటింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం డిజిటల్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఈ కేటగిరీలో ఇతర సౌకర్యాలలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సబ్‌వూఫర్, యాంప్లిఫైయర్‌తో కూడిన 11 ప్రీమియం JBL స్పీకర్లు ఉన్నాయి.