AI Cameras for Shoes : దృష్టిలోపం, అవయవ లోపం ఉన్నవారికి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. వారికి మరొకరు సహాయం చేయాల్సిందే. దుస్తులు వేసుకోవాలన్నా, బూట్లు ధరించాలన్నా, చివరికి ఆహారం తినాలన్నా సరే ఇంకొకరు సహాయం చేయాల్సిందే.. అలాంటి వారికోసం టెక్ ఇన్నోవేషన్ అనే ఆస్ట్రియన్ కంపెనీ వినూత్న ఆలోచన చేసింది. సరికొత్త ఆవిష్కరణను తెరపైకి తీసుకువచ్చింది.. దానివల్ల అంధులు, దృష్టిలోపాలతో బాధపడుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి దృష్టిలోపాలతో ఉన్నవారు వేటినీ అంత సులభంగా గుర్తించలేరు. అలాంటి వారి కోసం టెక్ ఇన్నోవేషన్ కంపెనీ సరికొత్త పాదరక్షలు అభివృద్ధి చేసింది. ఇవి సాధారణ పాదరక్షలు కావు. వీటిలో అత్యంత ఆధునికమైన సాంకేతికతను టెక్ ఇన్నోవేషన్ కంపెనీ జోడించింది. వీటి ద్వారా అద్భుతమైన అనుభూతి మాత్రమే కాకుండా ఇతరుల సహాయం లేకుండా నడవగలిగే తోడ్పాటును అందించే ఏర్పాటు చేసింది.
దృష్టిలోపం ఉన్నవారు నడిచే సమయంలో ప్రతిబంధకాలను, అవరోధాలను గుర్తించలేరు. అలాంటి వారి కోసం టెక్ ఇన్నోవేషన్ పాదరక్షలను డెవలప్ చేసింది. ఈ పాదరక్షలు ఆల్ట్రా సోనిక్ సెన్సార్ లను కలిగి ఉంటాయి. ఇవి నాలుగు మీటర్ల దూరంలో ఉన్న ప్రతిబంధకాలను సైతం గుర్తిస్తాయి. అవరోధాలను చెప్పగలుగుతాయి. ఆ తర్వాత ప్రత్యేకమైన శబ్దాలతో హెచ్చరికలు జారీచేస్తాయి. తద్వారా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తాయి. ఉదాహరణకు దృష్టిలోపం ఉన్నవారు నడుస్తున్నప్పుడు అడ్డుగా గోడ లేదా వాహనం లేదా చెట్లు లేదా మెట్లు ఇటువంటివి ఉన్నప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్ ఉన్న పాదరక్షలు వెంటనే స్పందిస్తాయి. ఆ తర్వాత ప్రత్యేకమైన శబ్దాలు చేస్తాయి. హెచ్చరికల ద్వారా దూరంగా ఉండాలని సంకేతాలు ఇస్తుంటాయి. అలాంటప్పుడు దృష్టిలోపాలు ఉన్నవారు సక్రమంగా నడవచ్చు. ఇతరుల సహాయం లేకుండానే ప్రయాణం సాగించవచ్చు. అవరోధాలు ఎదురు కాకుండా.. ప్రమాదాల బారిన పడకుండా తమ ప్రయాణాలను కొనసాగించవచ్చు. అయితే ఈ పాదరక్షలు ప్రస్తుతం ప్రయోదశలో ఉన్నాయి.. తదుపరి ప్రయోగాలు పూర్తయిన తర్వాత అందుబాటులోకి తీసుకొస్తామని టెక్ ఇన్నోవేషన్ కంపెనీ చెబుతోంది.
Also Read : బేబీ ఏఐ వీడియోలు.. సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ సందడి!
“దృష్టి లోపాలతో బాధపడే వారికోసం రూపొందిస్తున్న పాదరక్షలు ఇవి. వీటివల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి. మరొకరి సహాయం లేకుండానే ప్రయాణం సాగించే వెసలుబాటు కల్పిస్తాయి. దృష్టిలోపాలు ఉన్నవారి కోసం ప్రత్యేకంగా వీటిని రూపొందిస్తున్నాం. ఇవి ప్రయోగ దశలోనే ఉన్నాయి. భవిష్యత్తు కాలంలో మరిన్ని మార్పులు తీసుకొచ్చి అధునాతనమైన పాదరక్షలను అందిస్తాం. ఇంకా కొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది. ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేపట్టాల్సి ఉంది.. అవన్నీ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ పాదరక్షల ద్వారా దృష్టిలోపం ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పైగా వారు మెరుగైన ప్రయాణం చేయడానికి ఇవి దోహదం చేస్తాయని” టెక్ ఇన్నోవేషన్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.