Toyota: బీహార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కాన్వాయ్ కోసం కొత్త బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రణాళిక కోసం మొత్తం 15.99 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది బీహార్ ప్రభుత్వం. హోం శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు రవాణా శాఖ దీనిని అమలు చేయనుంది. ఈ కార్లను AK-47 తూటాల నుంచి, ఇతర బాంబు పేలుళ్లు, గ్యాస్ దాడుల వంటి పరిస్థితులను కూడా తట్టుకునేలా రూపొందించారు. VIPల కదలికల సమయంలో ఎదురయ్యే ప్రతి ప్రమాదాన్ని ఎదుర్కొనే విధంగా ప్రత్యేక భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు.
Also Read: బంగారు ఆభరణాలపై రుణం తీసుకుంటున్నారా?
బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల ప్రత్యేకతలు ఏమిటి?
ఈ వాహనాలను ఒక లాడార్ ఫ్రేమ్ ఛాసిస్ మీద నిర్మించారు. ఇది కారుకు చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీని అందిస్తుంది. ఈ కారుకు పవర్ ఫుల్ ఇంజిన్, అద్భుతమైన ఆఫ్-రోడ్ కెపాసిటీని కలిగి ఉంది. దీని వల్ల ఇది పట్టణ, గ్రామీణ రోడ్ల మీద కూడా ఈజీగా ప్రయాణించగలదు. కారు క్యాబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. విశాలంగా ఉంటుంది. ఇందులో ప్రయాణీకుల సౌకర్యం కోసం వివిధ రకాల మెటీరియల్‌లను అవసరానికి అనుగుణంగా అమర్చారు.
ఈ కారే టయోటా ఫార్చ్యూనర్. బీహార్ రవాణా శాఖ మంత్రి షీలా మండల్ గతంలో ప్రభుత్వం 16 బుల్లెట్‌ప్రూఫ్ టయోటా ఫార్చ్యూనర్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కారు ఇప్పటికే ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ఇతర లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో అమర్చబడి ఉంది. బుల్లెట్‌ప్రూఫింగ్ తర్వాత దీని సేఫ్టీ కెపాసిటీ మరింత పెరుగుతుంది. టయోటా ఫార్చ్యూనర్‌ను BR3 లేదా BR4 లెవల్ బుల్లెట్‌ప్రూఫింగ్‌తో తయారు చేస్తారు. BR3 లెవల్ .357 మాగ్నమ్ బుల్లెట్‌లు, తక్కువ స్పీడ్ గల తూటాల నుండి రక్షిస్తుంది. BR4 లెవల్ మరింత పవర్ ఫుల్ తూటాలు, పేలుళ్లను కూడా తట్టుకోగలదు.
బుల్లెట్‌ప్రూఫింగ్‌తో పాటు కొన్ని ఫార్చ్యూనర్‌లలో బాంబ్ వార్నింగ్ అలర్ట్, టింటెడ్ విండోస్ (లోపల ప్రయానీకులు బయటకు కనిపించరు) కలిగి ఉంటుంది. రన్-ఫ్లాట్ టైర్‌లు కూడా ఉండవచ్చు. టైర్ పంక్చర్ అయిన తర్వాత కూడా ఈ టైర్‌లు కారును కొంత దూరం వరకు నడపడానికి వీలు కల్పిస్తాయి. దేశవ్యాప్తంగా VIPలు తమ సేఫ్టీ కోసం టయోటా ఫార్చ్యూనర్ నే వాడుతారు. తూటాల వర్షం కురిసినా లేదా బాంబు పేలినా, ఈ అద్భుతమైన SUVపై ఒక చిన్న గీత కూడా పడదు.
Also Read: బేస్ మోడల్‌లోనూ టాప్ సేఫ్టీ.. మారుతి సంచలన నిర్ణయం!