Indian Express Power List 2025: ఇండియన్ ఎక్స్‌ప్రెస్(Indian Express) 2025 సంవత్సరానికి భారతదేశంలోని టాప్ 100 శక్తివంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) మొదటి స్థానంలో నిలిచారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోదీ, రాజకీయ ఆధిపత్యంతోపాటు ప్రపంచ వేదికపై భారత్‌ను శక్తివంతంగా నిలిపారు. ఆయన ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడం ఈ ర్యాంకుకు కారణమని నివేదిక పేర్కొంది.
Also Read: ట్రంప్ టారిఫ్ దెబ్బ బజాజ్, మహీంద్రా, రాయల్ ఎన్ఫీల్డ్లకు ఎందుకు ఉండదు ?
రెండో స్థానంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Sha) నిలిచారు. బీజేపీలో ఆయన వ్యూహాత్మక నాయకత్వం, రాజకీయ పట్టు ఆయనను శక్తివంతుడిగా నిలబెట్టాయి. విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ మూడో స్థానంలో, ఖ నాయకుడు మోహన్ భగవత్ నాలుగో స్థానంలో ఉన్నారు. జైశంకర్ దౌత్యపరమైన నైపుణ్యం, భగవత్ రాజకీయ ప్రభావం వారి స్థానాలకు బలం చేకూర్చాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) 9వ స్థానంలో నిలవగా, వ్యాపార దిగ్గజాలైన ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు.
క్రీడారంగంలో…
క్రీడల రంగంలో రోహిత్ శర్మ (48), విరాట్ కోహ్లీ (72), జస్ప్రీత్ బుమ్రా (83) స్థానాలు సాధించగా, సినిమా రంగంలో అలియా బట్ 100వ ర్యాంక్‌తో జాబితాను ముగించారు.
తెలుగు వ్యక్తులు..
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఈ జాబితాలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) 14వ స్థానంలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 73వ స్థానంలో, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ 89వ స్థానంలో ఉన్నారు. తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) 92వ స్థానంలో నిలిచారు. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర, రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ విజయం, పవన్ కల్యాణ్ రాజకీయ సినీ ప్రభావం, అల్లు అర్జున్ ‘పుష్ప 2‘ విజయంతో ఈ స్థానాలు సాధించారు.
అన్ని రంగాల నుంచి..
ఈ జాబితా రాజకీయ, వ్యాపార, క్రీడలు, సినిమా రంగాల్లో శక్తివంతులైన అంశాల ద్వారా విడుదల చేయబడింది. 2025లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రూపొందించిన భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రెండవ స్థానంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మూడో స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, నాల్గవ స్థానంలో ఖ చీఫ్ మోహన్ భాగవత్ నిలిచారు. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సినీ తారలు వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చోటు దక్కించుకున్నారు.