https://oktelugu.com/

Flight Ticket : రూ.599 కే విమాన ప్రయాణం.. వివరాలు ఏంటో తెలుసుకోండి..

Flight Ticket : విమానంలో ప్రయాణం చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ కలను కొంతమంది మాత్రమే నెరవేర్చుకుంటారు. ఎందుకంటే విదేశాలకు వెళ్లేవారు లేదా ఇతర నగరాలకు వెళ్లేవారు చాలా తక్కువ మంది ఉంటారు.

Written By: , Updated On : March 29, 2025 / 05:01 PM IST
Flight Ticket

Flight Ticket

Follow us on

Flight Ticket : విమానంలో ప్రయాణం చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ కలను కొంతమంది మాత్రమే నెరవేర్చుకుంటారు. ఎందుకంటే విదేశాలకు వెళ్లేవారు లేదా ఇతర నగరాలకు వెళ్లేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కొందరు బడ్జెట్లోనే ప్రయాణాలు చేయాలని అనుకునేవారు రైళ్లను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే కొందరు డబ్బు గురించి ఆలోచించకుండా విమానంలో ప్రయాణం చేయాలని కోరుకుంటారు. ఇలా విమానంలో ప్రయాణం చేయాలని అనుకునే వారికి Tata group కు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎకనామి క్లాస్ విమానాన్ని ఎక్కేయవచ్చు. విలాసవంతమైన సౌకర్యాలతో పాటు.. హ్యాపీగా కావాల్సిన నగరాలకు వెళ్లొచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..

టాటా గ్రూపుకు చెందిన Air India విమాన సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా చార్జీలను తగ్గిస్తూ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని 39 నగరాలకు వెళ్లాలని అనుకునేవారు ఈ ఆఫర్ పొందవచ్చు. సాధారణంగా ఎకనామీ క్లాస్ విమానం ధర సాధారణ విమానం కంటే అధికంగా ఉంటుంది. అందువల్ల ఇందులో కొందరు మాత్రమే ప్రయాణం చేయగలుగుతారు. దీంతో ఈ సీట్లు నిండకపోవడంతో ఎయిర్ ఇండియా సంస్థ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సీట్లను భర్తీ చేయడానికి తాజాగా ఆఫర్లు ప్రకటించింది.

Also Read : ఫ్లైట్ టికెట్‌పై పేరు తప్పుగా ఉంటే.. సరిద్దిద్దడం ఎలా?

ఈ ఆఫర్ ప్రకారం రూ. 599 చెల్లిస్తే ఎకనామిక్ క్లాస్ విమానాన్ని ఎక్కేయవచ్చు. అంటే ఎకనామిక్ క్లాస్ విమానం స్టాండర్డ్ చార్జీల కంటే రూ.599 ఎక్కువగా చెల్లిస్తే చాలు ఇందులో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎంచుకున్న రూట్, డిమాండ్ ను బట్టి ధర మారే అవకాశం ఉంటుంది. దీంతో సామాన్యులు సైతం ఇప్పుడు ఎకానమీ క్లాసులో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది.

ఎయిర్ ఇండియా వారానికి 50 వేల కంటే ఎక్కువ సీట్లతో 39 డొమెస్టిక్ రూట్లో ప్రీమియం ఎకానమినీ అందిస్తుంది. ముంబై నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి ముంబై వంటి ప్రధాన నగరాలకు 34 వేల సీట్లు కేటాయించింది. అయితే ఇందులో 30 శాతం సీట్లు పెంచాలని అనుకుంటుంది. దీంతో మొత్తం 65 వేల సీట్లకు చేరుకుంటుంది. దీని ద్వారా అటు ప్రయాణికులకు ఇటు సంస్థకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తుంది.

ఎకనామిక్ క్లాస్ విమానంలో ప్రయాణికులకు అనువైన సౌకర్యాలు ఉంటాయి. ఇందులో విశాలమైన స్పేస్ తో పాటు… కంపోటేబుల్ సీట్లు ఉండరున్నాయి.. ఇందులో నచ్చిన సీటను సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికోసం ఆధారంగా ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రయారిటీ చెకింగ్ బోర్డింగ్ బ్యాగేజ్ హ్యాండిల్ ఆప్షన్ లో ఉంటాయి. ప్రీమియం చైనా వేర్ లో వేడివేడి ఆహార వస్తువులు అందిస్తారు. సీట్లపై కవరింగ్.. సాఫ్ట్ గా కూర్చోవడానికి సౌకర్యాలను అందిస్తారు. క్యాబిన్ సైలెంట్ గా ఉండి రిచ్ తో కూడుకొని ఉంటుంది. ఇలా తక్కువ ధరకే రిచ్ ప్రయాణం చేయాలని అనుకునేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎయిర్ ఇండియా కంపెనీ తెలిపింది.

Also Read : రూ.883లకే విమాన ప్రయాణం..!