Today Gold Price: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ కారణాలతో మార్కెట్లో బంగారంనకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో దీనిపై ఇన్వెస్టర్లు పెరిగిపోతున్నారు. దీంతో బంగారం తగ్గుతుందని చూసేవారి ఆశలు గల్లంతవుతున్నాయి. బంగారం ధర పెరగడమే గానీ.. తగ్గడం లేదని తెలియడంతో నిరాశ చెందుతున్నారు. బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయో చూద్దాం..
బలియన్ మార్కెట్ ప్రకారం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,850గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,440 పలుకుతోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజ బంగారం రూ.100కు పైగానే పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే వెండి ధరలు కూడా ఎగబాకాయి. ఈరోజు ఒక్కసారిగా రూ.2,000 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండిని రూ.1,28,000లతో విక్రయిస్తున్నారు. మరి దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,440 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,290.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,290గా నమోదైంది. అలాగే బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,290 ఉండగా.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,290పలుకుతోంది.
Also Read: ITR deadline 2025: గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే జరిగే నష్టాలు ఇవే!
ప్రస్తుత ధరలతో కొనుగోలు దారులు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాసం ప్రారంభం అవుతున్నవేళ బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక పూజలు ఉండడంతో పాటు వివాహాలు జరగనున్నాయి. దీంతో బంగారం కొనేదెలా అని అంటున్నారు. అయితే అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే కొన్ని నిర్ణయాలతో డాలర్ విలువ పడిపోతుంది. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది డాలర్ కంటే బంగారంపైనే ఎక్కువగా ఇన్వెస్ట్ మెంట్ చేస్తన్నారు. దీంతో బంగారంపై పెట్టుబడలు పెట్టినవారికి లాభాల పంట పండుతోంది. మరోవైపు వెండికి కూడా డిమాండ్ పెరుగుతుండడంతో కాస్త డబ్బులు తక్కువ ఉన్నవారు దీనిని కొనగోలు చేస్తున్నారు.
కొన్నాళ్ల పాటు బంగారం ధరలు తగ్గుతాయన్న ప్రచారం జరిగింది. దీంతో కొంత మంది బంగారం కొనుగోలు చేయడానికి వెనుకాడారు. కానీ ఇప్పుడు ఊహించనంతగా బంగారం ధరలు పెరగాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇంత ధరకు రాలేదు. అయితే ఇంకా ముందు ముందు ధరలు పెరిగే అవకాశం ఉందా? లేదా? అనేది చూడాలి.