ITR deadline 2025: ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. ఎటువంటి జరిమానాలు లేదా లేట్ ఫీజులు చెల్లించకుండా మీ ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి నిమిషం వరకు వేచి ఉండవద్దు. ఎందుకంటే, చివరి తేదీ దగ్గర పడే కొద్దీ, ఒకేసారి చాలా మంది వెబ్‌సైట్‌ను చూస్తుంటారు కాబట్టి, ఆదాయపు పన్ను వెబ్‌సైట్ క్రాష్ అయిపోయే అవకాశం ఉంది. అందుకే ఐటీఆర్‌ను ముందుగానే దాఖలు చేయడం వల్ల మీకు టెన్షన్ ఉండదు. చెల్లించిన పన్ను రీఫండ్స్ త్వరగా వస్తాయి, అనవసరమైన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీరు జీతం పొందే ఉద్యోగి అయినా, సొంతంగా పనిచేసే ఫ్రీలాన్సర్ అయినా, లేదా వ్యాపారం చేసే యజమాని అయినా, మీ డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయని చూసుకొని ఐటీ రిటర్న్‌ను టైంకు సమర్పించండి.
Also Read: పళ్లు తోముకుంటే క్యాన్సర్.. ఇక ఎలా బతకడం దేవుడా!
సాధారణంగా, ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31వ తేదీ అవుతుంది. కానీ, కొన్నిసార్లు రకరకాల కారణాల వల్ల గడువు పొడగిస్తారు. ముఖ్యంగా టెక్నికల్ ఇష్యూస్ వస్తే లేదా చాలా మంది ట్యాక్స్ పేయర్స్ ఒకేసారి వెబ్‌సైట్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించడం వల్ల సర్వర్లు డౌన్ అయినప్పుడు ప్రభుత్వం గడువును పెంచుతుంది. ఈ సంవత్సరం కూడా ట్యాక్స్ పేయర్లకు మరింత సమయం ఇవ్వడానికి, చివరి నిమిషంలో జరిగే రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువు పొడిగింపు వల్ల ట్యాక్స్ పేయర్లు తమ డాక్యుమెంట్లను సరిచూసుకోవడానికి, ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి ఇంకాస్త సమయం దొరుకుతుంది.
View this post on Instagram
ఆదాయపు పన్ను రిటర్న్‌ను సమయానికి ఫైల్ చేయడం చాలా చాలా ముఖ్యం. దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. గడువు తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, ఇన్ కం ట్యాక్స్ చట్టం ప్రకారం జరిమానాలు పడతాయి. ఒకవేళ గడువు దాటిన తర్వాత ఫైల్ చేస్తే, ఆలస్య రుసుములు కూడా కట్టాల్సి వస్తుంది. మీరు ట్యాక్స్ ఎక్కువ కట్టి ఉంటే, ఆ అదనపు డబ్బు తిరిగి రావాలంటే ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఎంత త్వరగా ఫైల్ చేస్తే రీఫండ్ అంత త్వరగా వస్తుంది. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ లేదా ఇతర లోన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులు ఐటీఆర్ రికార్డులను చూస్తాయి. క్రమం తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేస్తే, ఆర్థికంగా క్రమశిక్షణతో ఉన్నారని బ్యాంకులకు తెలుస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, ముఖ్యంగా వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు గత కొన్ని సంవత్సరాల ఐటీఆర్ రికార్డులు అడుగుతారు. ముందుగానే ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల మీకు చాలా మానసిక ప్రశాంతత ఉంటుంది.
Also Read: టీవీ9ని మించిపోయిన ఆ డిజిటల్ టీవీ.. ఏం చెబుతున్నారో వాళ్లకే తెలియదు
ఐటీఆర్ ఫైల్ చేసే ముందు కొన్ని డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పని చేస్తున్న కంపెనీ ఇచ్చే ఫారం 16, ఫారం 26AS, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, వడ్డీ సర్టిఫికేట్‌లు,పెట్టుబడికి సంబంధించిన ఆధారాలు, హోమ్ లోన్ స్టేట్‌మెంట్, ఇతర ఆదాయ వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంచుకోవాలి.