Gold Rate: కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా భారీగా పెరిగాయి. శనివారం బంగారం వెయ్యికి పైగా పెరగగా.. వెండి ధర 9000 పెరిగింది. అంతర్జాతీయ కారణాలతో పాటు పెట్టుబడులకు కొందరు ముందుకు రావడంతో బంగారం ధర పెరిగినట్లు కనిపిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సీజన్ లేకపోయినా కూడా మొన్నటివరకు బంగారం ధర తగ్గడంతో కొనుగోలు పెరిగాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ పెరగడంతో ఆందోళన వాతావరణం ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు 1,20,000 మధ్య ఉన్న బంగారం ఇప్పుడు లక్ష 30 వేలకు చేరింది. దీంతో బంగారం కొనడం ప్రస్తుతం కష్టమే అని కొందరు నిరాశపడుతున్నారు. హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,820 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,000 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం శనివారం రూ. 1360 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1250 పెరిగింది. డాలర్ తో పోలిస్తే రూపాయి ధర పడిపోవడంతో బంగారం ధర పెరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే అమెరికాలోని ఫెడరల్ రిజర్వు మీటింగ్లో 25 బేసిస్ పాయింట్లు తగ్గే ఆలోచనలో ఉన్నట్లు వ్యక్తం కావడంతో బంగారంపై పెట్టుబడులు పెరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొందరు ప్రముఖులు ఇటీవల 2026 సంవత్సరంలో రూ ఆరు లక్షల వరకు బంగారం పెరిగే అవకాశం ఉందని అనడంతో చాలామంది సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే రూ. 20000 వరకు బంగారం ధర పెరగడంపై చర్చ సాగుతోంది.
మరోవైపు వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి రూ. 9000 వరకు పెరగడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,92,000 కి చేరింది. అయితే మొన్నటి వరకు బంగారం కంటే వెండి కొనుగోలు చేయాలని చాలామంది ఆసక్తి చూపారు. అయితే కొన్ని రోజుల కింద వెండి ధరలు అమాంతం పడిపోయాయి. కానీ మరోసారి వెండి ధరలు కూడా పెరగడంతో దీనిపై కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. వెండిని కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్, ఇతర రంగాల్లో కూడా ఉపయోగించడంతో దీనిపై డిమాండ్ పెరుగుతుంది.
అయితే అంతర్జాతీయంగా మాత్రమే బంగారంపై పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బంగారం ధర ఎక్కువగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే బంగారం ధర తగ్గే వరకు వేచి చూసే అవకాశం ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం పెళ్లిల సీజన్ లేకపోవడంతో బంగారం కొనడాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.