Viral News: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వింతైన సంఘటనలు వెలుగులోకి రావడం పెరిగిపోయింది. గతంలో ఇలాంటి సంఘటనలు అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియా విస్తృతి పెరిగిపోయిన తర్వాత వింతైన సంఘటనలు.. సంచలనం కలిగించే విషయాలు వెలుగులోకి రావడం అమాంతం పెరిగిపోయింది.
ఆ యువకుడికి 34 సంవత్సరాల వయసు. కడుపు నొప్పితో బాధపడుతూ.. వికారం, వాంతులతో ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులు పెరిగిన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. కడుపు నొప్పి వల్ల అతడు ఆహారం తినలేకపోయాడు. కనీసం నీళ్లు కూడా తాగలేకపోయాడు. వైద్యులకు కూడా అతని బాధ ఏమిటో అంతుపట్టలేదు. దీంతో అత్యంత ఆధునికమైన యంత్రాలతో స్కానింగ్ నిర్వహించారు. స్కానింగ్ రిపోర్టులో వైద్యులకు దిమ్మ తిరిగిపోయే నిజాలు తెలిసాయి.
వైద్యులు చూసిన ఆనివేదికలో ఆ వ్యక్తికి డిప్రెషన్ తో పాటు.. ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసింది. స్కానింగ్ రిపోర్టు లో అతడి శరీరంలో సమతుల్యం లేదని వైద్యులు గుర్తించారు. అంతే కాదు వైద్యులు శస్త్ర చికిత్స చేసిన తర్వాత ఆ వ్యక్తి కడుపు నుంచి అరటిపండును బయటికి తీశారు. దానికి కం*డో*మ్ చుట్టి ఉండడంతో ఆశ్చర్యపోయారు. కం*డో*మ్ చుట్టి ఉన్న అరటిపండు చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆపరేషన్ అనంతరం మూడు రోజులపాటు ఆ వ్యక్తిని వైద్యులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు.
శస్త్ర చికిత్స జరిగినప్పటికీ ఆ వ్యక్తి మలవిసర్జన చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆహారం తినడానికి కూడా అవస్థ పడుతున్నాడు. ఆ రోగి సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. తమ హిస్టరీలో ఒక రోగి కం*డో*మ్ చుట్టూ ఉన్న అరటి పండును మింగడం ఇదే తొలిసారి అని ఆ వైద్యులు చెబుతున్నారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను వైద్యులు క్యూరోస్ జర్నల్ లో ప్రచురించారు. అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేయడానికి.. మత్తు పదార్థాలను కం*డో*మ్ లో నింపుతుంటారు. కొంతమంది వ్యక్తులకు భారీగా డబ్బులు ఇచ్చి మింగిస్తారు. ఆ తర్వాత వారి శరీరం నుంచి వాటిని బయటకు తీస్తారు. అయితే వ్యక్తి తరహా సంఘటన ఇంతవరకూ తాము చూడలేదని వైద్యులు అంటున్నారు.