Vidadala Rajini: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఫైర్ బ్రాండ్లు ఎక్కువ. అయితే పద్ధతి ప్రకారం మాట్లాడేది మాత్రం చాలా తక్కువ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకన కావడానికి అది ఒక కారణమే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు కానీ.. ప్రతిపక్షంలో ఉన్నారు కనుక అందర్నీ కలుపుకొని వెళ్లక తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు నోటికి పని చెప్పిన నేతలతో పార్టీ మూల్యం చెల్లించుకుంది. అయితే అప్పట్లో అలా అడ్డదిడ్డంగా మాట్లాడిన నేతలు ఇప్పుడు కనిపించకుండా మానేశారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లిపోయారు. పేర్ని నాని లాంటి వారు మాట్లాడుతున్నారు. కానీ అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, విడదల రజినీ లాంటి నేతలు ఇప్పుడు కనిపించకుండా మానేశారు. అయితే వీరి నియోజకవర్గాలు సైతం గల్లంతు కావడంతోనే కనిపించకుండా మానేశారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా విడదల రజిని విషయంలో ఇటీవల ఒక వార్త హల్చల్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆమెకు రేపల్లె ఇన్చార్జిగా వెళ్లాలని సూచించినట్లు ప్రచారం నడిచింది. అది మొదలు రజిని పొలిటికల్ గా యాక్టివ్ తగ్గించారు. పెద్దగా కనిపించడం లేదు కూడా. పోనీ కూటమి పార్టీలో చేరుతామంటే అక్కడ ఛాన్స్ లేదు. వైసీపీలో మాత్రం ఎక్కడ కుదురుగా నిలబడనివ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వచ్చింది గొడవ అంటూ రజిని ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నట్లు సమాచారం.
* గొప్ప అదృష్టం..
ఒక విధంగా చెప్పాలంటే సరైన టైంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అదృష్టం దక్కించుకున్నారు రజిని( Rajini ). 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ టిడిపిలోకి ప్రవేశించారు. అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరురాలుగా కొనసాగారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదని భావించారు. జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా చేరిన మరుక్షణం టికెట్ దక్కించుకున్నారు. పోటీ చేసిన తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఏకంగా మంత్రి అయ్యారు. పవర్ పాలిటిక్స్ రుచి చూశారు. సరికొత్తగా రాజకీయాలు చేసుకుంటూ ముందుకు సాగారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆమెను కుదురుగా కూర్చోనివ్వడం లేదు.. నిలకడగా నిలబడనివ్వడం లేదు.
* నియోజకవర్గాల మార్పు..
2024 ఎన్నికల్లో విడదల రజిని నియోజకవర్గాన్ని మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పటివరకు ఉన్న చిలకలూరిపేట( chilakaluripeta ) నియోజకవర్గాన్ని కాదని గుంటూరు పశ్చిమ సీటు కేటాయించారు. అయితే మన ఇంట్లో ఉన్న చెత్త పక్క ఇంట్లో పారబోస్తే బంగారం అవుతుందని భావించినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. అలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లిన రజనీకి దారుణ పరాజయం తప్పులేదు. దీంతో ఎన్నికల తరువాత ఆమె చిలకలూరిపేట వచ్చేసారు. రజిని మనసును తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆమెను చిలకలూరిపేటకు షిఫ్టు చేయించారు. అయితే ఇప్పుడు రేపల్లె వెళ్ళమంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రేపల్లె ఇన్చార్జి పదవి ఆశించిన మోపిదేవి వెంకటరమణను వదులుకున్నారు జగన్. ఇప్పుడు అదే ప్లేస్ లోకి రజినీని వెళ్ళమంటున్నారు. ఆమె మాత్రం చిలకలూరిపేట ను విడిచిపెట్టి వెళ్లనని చెబుతున్నారు. వెళ్లాల్సిందేనని పట్టుబడుతుండడంతో రజిని పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు.
* చివరకు మిగిలింది ఆ రెండు పార్టీలు..
మీరు నాటిన సైబరాబాద్ ( Cyberabad) మొక్కను అంటూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసారు రజిని. మీరు ఇచ్చిన రాజకీయ జీవితం అంటూ మొసలి కన్నీరు కార్చారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. అంటే తెలుగుదేశం పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆమె ముందున్న ఆప్షన్ జనసేన. అంతకుమించి ఆలోచన చేస్తే బిజెపి. ఆ రెండు పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. దీంతో పొలిటికల్ గా సైలెంట్ కావడమే ఉత్తమమని గత కొద్దిరోజులుగా కనిపించకుండా మానేశారు రజిని.