Today Gold And Silver Rate: గత ఆరు నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులతో పాటు.. బంగారంపై ఇన్వెస్ట్మెంట్ పెరగడంతో వీటి ధరలు అమాంతం పెరిగాయి. అయితే బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. బంగారం ధర 10 గ్రాములకు రూ.1,30,000 అయిన నేపథ్యంలో.. బంగారం కంటే వెండి కొనుగోలు చేయడం నయమని చాలామంది భావించారు. అంతేకాకుండా వివిధ ఇండస్ట్రీలో వెండి వినియోగం పెరగడంతో మన దేశంలో వెండికి డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా బంగారం కొనలేని వారు వెండి కొనుగోలు చేస్తూ వచ్చారు. ఇలా కిలో వెండి రూ. రెండు లక్షల వరకు చేరింది. అయితే దీపావళి పండుగ వేళ ఒక్కసారిగా వెండి ధరలు కుప్పకూలాయి. ప్రస్తుతం వీడి ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం అక్టోబర్ 18న హైదరాబాద్ లో వెండి ధరలు భారీగా తగ్గాయి. ఒకసారిగా 13000 తగ్గడంతో ప్రస్తుతం వెండి ధర కిలోకు రూ.1,90,000 లకు పడిపోయింది. అక్టోబర్ 17న వెండి ధరలు రూ.3,000 తగ్గింది. రెండు రోజుల్లో దాదాపు రూ.16,000 తగ్గడంతో వెండిని కొనుగోలు చేసిన వారు షాక్ కు గురయ్యారు. ఎందుకంటే నిన్నటి వరకు బంగారం కంటే వెండి కొనుగోలు ఎక్కువగా సాగాయి. 10 గ్రాముల బంగారం కొనుగోలు చేయడం కంటే కిలో వెండి కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఎంతో సేఫ్ అని భావించారు. కానీ ఒక్కసారిగా ఊహించని విధంగా వెండి ధరలు కుప్పకూలడంతో భారీ మొత్తంలో కొనుగోలు చేసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ధన త్రయోదశి వేడుకలు జరుపుకుంటారు. అక్టోబర్ 18న ధన త్రయోదశి సందర్భంగా బంగారం లేదా వెండి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో వెండి ధరలు తగ్గడంతో కొనుగోలు చేయడానికి కొంతమంది ఆసక్తి చూపుతున్నారు. అయితే వెండిపై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం చాలామంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వరుసగా రెండు రోజులు వెండి ధరలు భారీ మొత్తంలో తగ్గడంతో.. మరింతగా తగ్గే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు
ఇక బంగారం ధరలు సైతం తగ్గుతూ వస్తున్నాయి. అక్టోబర్ 18న బులియన్ మార్కెట్ ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,910 తగ్గింది దీంతో ప్రస్తుతం రూ.1,30,860 గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,750 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం రూ.1,19,950 గా కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలు తగ్గడంతో దీనిపై ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఆలోచిస్తున్నారు. నిన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపేవారు. లిక్విడ్ గానే కాకుండా ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి చూపారు. అయితే ఇలా ఊహించని విధంగా బంగారం ధరలు తగ్గడంతో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా? లేదా? అనేది చూడాలి.