Gummadi Narsayya Biopic: గుమ్మడి నర్సయ్య(Gummadi Narsayya)..రాజకీయాలను బాగా అనుసరించే వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. మిగిలిన వాళ్లకు ఈయన గురించి అంతగా తెలిసి ఉండదు. కానీ ప్రతీ ఒక్కరు ఈయన జీవిత చరిత్ర ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ జిల్లాలోని ఇల్లందు ప్రాంతం నుండి CPI పార్టీ నుండి పోటీ చేసి ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన చరిత్ర ఆయనది. ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిస్తేనే ఎదో దేశానికీ ప్రధాన మంత్రి అయిపోయినట్టు ఫీల్ అయ్యి, హంగులు, ఆర్భాటాలతో జనాల మధ్య వెళ్లే ఎమ్మెల్యేలు ఉన్న ఈ కాలం లో, ఇన్ని సార్లు ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ కూడా, ఒక సాధారణ మనిషి లాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం, ఎలాంటి సౌకర్యాలను కోరుకోకపోవడం, తన రక్షణ కోసం కనీసం గన్ మ్యాన్స్ ని కూడా పెట్టుకోకపోవడం, ఇలాంటి మనుషులు మన భారత దేశంలో ఎంత మంది ఉంటారు చెప్పండి.
గాంధీ కాలం లోనే ఇలాంటి వాళ్ళని అప్పటి తరం ప్రజలు చూసి ఉంటారు. స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తున్న ఈ కాలంలో ఇలాంటి మనుషులు ఉండడం అరుదు. అలాంటి అత్యున్నత వ్యక్తి జీవిత చరిత్ర ని సినిమా గా తీస్తే ఎన్నో లక్షల మందికి చేరుతుంది. కానీ మన టాలీవుడ్ నుండి ఒక్క హీరో కూడా ఈయన బయోపిక్ లో నటించడానికి ఆసక్తి చూపించలేదు. కానీ ఒక్క కన్నడ హీరో మాత్రం గుమ్మడి నర్సయ్య గొప్పతనాన్ని గమనించాడు. ఆయన ఎవరో కాదు, శివ రాజ్ కుమార్. కన్నడ లో సూపర్ స్టార్ గా దశాబ్దాల నుండి కొనసాగుతున్న ఈయన, గుమ్మడి నర్సయ్య గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయాడట. నేరుగా ఆయన ఇంటికి వెళ్లి, మీ జీవితాన్ని జనాలు చూడాలి, మీ పాత్రలో నటించేందుకు నాకు అనుమతి ని ఇవ్వండి అంటూ ముందుకొచ్చాడు. శివ రాజ్ కుమార్(Siva Raj Kumar) కారణంగా అసలు ఎవరు ఈ గుమ్మడి నర్సయ్య అని తెలుసుకోవడం కోసం గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు నెటిజెన్స్.
రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఇంతమంది స్టార్ హీరోలు ఉన్నారు, సీనియర్ హీరోలు ఉన్నారు, ఒక్కరు కూడా గుమ్మడి నర్సయ్య ని పట్టించుకోలేదు. అసలు ఆయన అనేవాడు ఉన్నాడు అనే విషయమైనా వాళ్లకు తెలుసో లేదో, మట్టిలో మాణిక్యం లాగా, తన ఊరి జనాలకు ఎనలేని సేవలు చేసుకుంటూ ముందుకెళ్తున్న గుమ్మడి నర్సయ్య, జీవితం లో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. విజయాలతో పాటు, ఆయనకు ఎన్నో అవమానాలు కూడా ఎదురు అయ్యాయి. ఉదాహరణకు రీసెంట్ గానే తన ఊరి సమస్యలు చెప్పుకొని, ఫండ్స్ అడిగేందుకు ముఖ్యమంత్రి ని కలవడానికి వెళ్తే,కనీసం ఆయనకు అప్పోయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇలాంటి దారుణమైన అవమానాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఎత్తుపల్లాలను చూపిస్తూ బయోపిక్ తీస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్ అవుతాయి. మరి ఈ ప్రాజెక్ట్ రాబోయే రోజుల్లో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.