Anant Ambani: ఆ చికిత్సనే కొంప ముంచింది.. అనంత్ అంబానీ అంత బరువు సమస్య వెనుక కారణం ఇదే

అనంత్ అంబానీ అంతకుముందు చాలా లావుగా ఉండేవాడు. ఆ తర్వాత ఒక్కసారిగా సన్నగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ సందర్భంలో అనంత్ కు ఆస్తమా ఉన్నందున.. దానిని తగ్గించేందుకు తీసుకున్న చికిత్స వల్ల అతడు బరువు పెరిగాడని నీతా అంబానీ పేర్కొన్నారు.

Written By: Suresh, Updated On : March 3, 2024 6:25 pm

Anant Ambani

Follow us on

Anant Ambani: మరికొద్ది గంటల్లో అనంత్ అంబానీ తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్ తో మూడు రోజులపాటు జరుపుకుంటున్న ముందస్తు పెళ్లి వేడుకలు ముగుస్తాయి. మరో మూడు నెలల తర్వాత అనంత్ అంబానీ రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు. దీనికోసం త్వరలో ఏర్పాట్లు ప్రారంభమవుతాయని రిలయన్స్ వర్గాలు అంటున్నాయి. ముందస్తు పెళ్లి వేడుకల్లో అనంత్ అంబానీ తన బరువు గురించి.. దానిని తగ్గించుకోవడం కోసం పడ్డ ఇబ్బందుల గురించి.. చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనంత్ మాట్లాడుతున్నంత సేపు ముఖేష్ అంబానీ కన్నీరు కార్చాడు. వాస్తవానికి అనంత్ అంబానీ ఆస్తమా వ్యాధి గ్రస్తుడు. దాన్ని తగ్గించుకోవడానికి చాలా మందులే వాడాడు. ఆ మందులే అతడికి ప్రతిబంధకంగా మారాయా? అతడు బరువు పెరగడానికి కారణమయ్యాయా? అంటే ఔననే అంటున్నాయి వైద్య వర్గాలు.

అనంత్ అంబానీ అంతకుముందు చాలా లావుగా ఉండేవాడు. ఆ తర్వాత ఒక్కసారిగా సన్నగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ సందర్భంలో అనంత్ కు ఆస్తమా ఉన్నందున.. దానిని తగ్గించేందుకు తీసుకున్న చికిత్స వల్ల అతడు బరువు పెరిగాడని నీతా అంబానీ పేర్కొన్నారు. ఆస్తమా చికిత్సలో భాగంగా అనంత్ అంబానీ స్టెరాయిడ్స్ వాడేవాడు. స్టెరాయిడ్స్ వాడకముందు అతడు 208 కిలోల బరువున్నాడు. ఆ తర్వాత సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్ వినోద్ చన్నా వద్ద 18 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. దాదాపు 108 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు. బరువు తగ్గడానికి యోగా, వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ వంటి వర్కౌట్స్ చేశాడు.. ఆ సమయంలో అతడికి ఆస్తమా మళ్లీ తిరగబెట్టింది. దీంతో స్టెరాయిడ్స్ వాడకం తప్పనిసరయింది. అందు వల్లనే అతడు బరువు పెరిగాడని నీతా అంబానీ అప్పట్లో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వాస్తవానికి ఆస్తమా ఉంటే ఎవరూ బరువు పెరగరు. దాని నివారణ కోసం వాడే మందులే సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయని వైద్యులు అంటున్నారు. ఆస్తమా నివారణకు కార్టికో స్టెరాయిడ్స్ మందులు వాడతారు. అవి ఆకలిని పెంచుతాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. వీటివల్ల శరీరంలో నీరు కూడా నిలిచిపోతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.. కార్టికో స్టెరాయిడ్స్ శరీరంలో జీవక్రియ క్రమబద్ధీకరణకు ఆటంకం కలిగిస్తాయి. దీనివల్ల ఊబకాయం వస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల లావు అవుతారు. ముఖ్యంగా ఉదరం, నడుము, పిరుదుల భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కండరాల వ్యాకోచం తగ్గి కొవ్వు పెరుగుతుంది.

స్టెరాయిడ్ ట్రీట్మెంట్ మరి భారీ స్థాయిలో ఊబకాయానికి కారణం కాదంటున్నారు వైద్యులు. బరువు ఏ స్థాయిలో పెరుగుతారనేది వ్యక్తుల జీవన శైలి పై ఆధారపడి ఉంటుంది. కార్టికో స్టెరాయిడ్స్ తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. వర్కౌట్స్ పాటించాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తినకూడదు. పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. అప్పుడే శరీరంలో జీవన క్రియలు క్రమబద్ధ దశలో సాగుతాయి.
(పై కంటెంట్ మాకు తెలిసిన విషయాల ఆధారంగా రాశాం. నిపుణుల సలహాలను పరిగణలోకి తీసుకొన్నాం. వీటిని పాటించే ముందు ఒక్కసారి వైద్యులను సంప్రదిస్తే మంచిది)