https://oktelugu.com/

Boyapati Srinu: బోయపాటి మొదటి సినిమాను బాలయ్య తో చేయాల్సింది ఎలా మిస్ అయిందంటే..?

బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండ లాంటి సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. ఇక ఇది ఇలా ఉంటే బోయపాటి శ్రీను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ముత్యాల సుబ్బయ్య దగ్గర దాదాపు పది సంవత్సరాలపాటు దర్శకత్వ విభాగంలో పనిచేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 3, 2024 / 06:29 PM IST

    Boyapati Srinu

    Follow us on

    Boyapati Srinu: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను… ఈయన రవితేజ ను హీరోగా పెట్టి చేసిన ‘భద్ర ‘ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఇక మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ని అందుకున్న బోయపాటి శ్రీను ఆ తర్వాత వెంకటేష్ హీరోగా, నయనతార ను హీరోయిన్ గా పెట్టి తులసి అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక దాంతో బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండ లాంటి సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. ఇక ఇది ఇలా ఉంటే బోయపాటి శ్రీను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ముత్యాల సుబ్బయ్య దగ్గర దాదాపు పది సంవత్సరాలపాటు దర్శకత్వ విభాగంలో పనిచేశాడు.

    ఇక బోయపాటి ఆయన దగ్గర వర్క్ చేస్తున్న సమయంలోనే బాలయ్య బాబు ఇమేజ్ కి సరిపడా ఒక కథను కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాడట. మొదటి సినిమాతో బాలయ్య బాబుని డైరెక్ట్ చేసే అవకాశం రాదనే ఉద్దేశ్యం తో బోయపాటి శ్రీను మొదట ఒక మంచి లవ్ స్టోరీ ని రాసుకొని దానికి ఫ్యాక్షన్ అంశాలను జోడించి భద్ర సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో అటు రవితేజ స్టార్ హీరోగా మారితే, ఇటు బోయపాటి శ్రీను కూడా స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని, మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించాడు.

    ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు మళ్లీ బాలయ్య బాబు కోసం ఒక కొత్త కథను రెఢీ చేసే పనిలో బోయపాటి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో కూడా బాలయ్య బాబుకు భారీ హిట్ ఇస్తానని బోయపాటి మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఇక అలాగే బాలయ్య బాబు అభిమానులు కూడా బోయపాటితో బాలయ్య చేసే సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు…