https://oktelugu.com/

Mukesh Ambani: ముఖేష్ అంబానీ కుటుంబం తాగే పాలు ఇవే.. ఎందుకంత స్పెషల్ అంటే?

ముఖేష్ అంబానీతో సహా అతని కుటుంబం మొత్తం పాలు అయినా స్వచ్ఛమైన ఆహారం తినాలని అనుకుంటారు. వారు మాత్రమే కాదు చాలా మంది ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కానీ కొందరికి కుదరదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 18, 2024 / 01:00 AM IST

    Mukesh Ambani

    Follow us on

    Mukesh Ambani: ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ గురించి ఏ వార్త అయినా సరే ప్రజలకు చాలా ఇంట్రెస్ట్ ను ఇస్తుంది. ఆయన గురించి ఆయన చేసే వ్యాపారాల గురించి, ఫ్యామిలీ, వారు తినే ఫుడ్, ట్రిప్స్ ఇలా ఏ విషయం గురించి అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంటుంది. అదే విధంగా వీరి గురించి తరచుగా ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అంబానీ ఇంట ఏదైనా శుభకార్యం నిర్వహిస్తే నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టడం కూడా కామన్. ఇటీవల అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇక పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునేలా అంగరంగ వైభవంగా నిర్వహించారు అంబానీ కుమారుడి పెళ్లి. ఇక అప్పుడప్పుడు అంబానీ ఫ్యామిలీలో వాడే వస్తువులు, కార్లు, ఆభరణాల గురించి కూడా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు కూడా అంబానీ కుటుంబం తాగే పాల గురించి తెగ వైరల్ అవుతుంది. మరీ ఆ పాల ప్రత్యేకత ఏంటి ఎందుకు వైరల్ అవుతుంది అనుకుంటున్నారా?

    ముఖేష్ అంబానీతో సహా అతని కుటుంబం మొత్తం పాలు అయినా స్వచ్ఛమైన ఆహారం తినాలని అనుకుంటారు. వారు మాత్రమే కాదు చాలా మంది ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కానీ కొందరికి కుదరదు. అంబానీ ఇంటికి రోజూ తాజా ఆహార పదార్థాలు మాత్రమే వస్తాయి. అంబానీ కుటుంబంబానికి కిచెన్‌లో చాలా ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయట. అయితే వారి ఇంటికి వచ్చే పాలు కూడా చాలా స్పెషల్ అని టాక్.

    ముఖేష్ అంబానీ ప్రత్యేక విదేశీ జాతి చెందిన స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు పాలు మాత్రమే తాగుతుంటారు అని సమాచారం. పూణే నుంచి అతని ఇంటికి వస్తుందట ఈ ఆవు పాలు. ఇది స్విస్ జాతికి చెందిన ఆవు. దీని పాలలో చాలా పోషక విలువలతో నిండి ఉంటుంది. వీటిలో ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్ డి లు లభిస్తాయట. పూణేలో స్పెషల్ హైటెక్ లెవల్ లో 35 ఎకరాల్లో ఓ డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసి వీటిని సాగు చేస్తున్నారట. పూణేకు చెందిన హైటెక్ భాగ్యలక్ష్మి డెయిరీలో 3000 పైగా విదేశీ జాతి ఆవులు ఉన్నాయి. అందులోనే ఈ ఆవులు కూడా ఉన్నాయట.

    లక్షల విలువ చేసే ఈ ఆవుల కోసం రబ్బర్ కోటెడ్ పరుపులను వాడుతుంటారు. కేరళ నుంచి వేల రూపాయలు వెచ్చించి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఆర్‌ఓ (RO) నీటిని మాత్రమే తాగుతాయి ఈ ఆవులు. ఈ జాతికి చెందిన ఆవు రోజుకు 25 లీటర్ల పాలను అందిస్తుంది. ఈ పాలల్లో కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఈ పాల ధర లీటర్‌కు రూ.150కిపైగానే పలుకుతుందట.

    హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ పాలు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన పాల ఉత్పత్తి అంటున్నారు నిపుణులు. ఇది A1, A2 బీటా కేసైన్ (ప్రోటీన్) రెండింటిలోనూ సమృద్ధిగా లభిస్తుందట. ఈ పాలు పాడి పరిశ్రమలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి కూడా. ప్రోటీన్లు, స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలు, అవసరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లలో ఉండే ఈ ఆవులు చాలా ప్రత్యేకమైనవి. అయితే పూర్తిగా పెరిగిన హోల్‌స్టెయిన్ ఆవు 680 నుంచి 770 కిలోల బరువు కూడా ఉంటుంది.