https://oktelugu.com/

Eye Care: కళ్లు రుద్దితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మీకు తెలుసా?

ఎక్కువగా కళ్లను రుద్దితే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా రుద్దితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్, అలెర్జీ వంటివి వస్తాయి. ముఖ్యంగా సీజన్ లో అయితే అసలు కళ్లను రుద్దకూడదు. ఇలా రుద్దడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మరి చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 18, 2024 / 02:00 AM IST

    rubbing your eyes

    Follow us on

    Eye Care: కళ్లు చాలా ముఖ్యమైనవి. ప్రపంచ అందాన్ని చూడాలంటే కళ్లు అనేవి ముఖ్యమైనవి. అయితే ఈరోజుల్లో కళ్ల సమస్యలు కూడా ఎక్కువగా అయ్యాయి. ప్రస్తుతం చాలా మంది అధికంగా మొబైల్ చూస్తున్నారు. దీని నుంచి వచ్చే కిరణాలు కళ్లకు అంత మంచిది కాదు. అయిన చాలా మంది చూస్తుంటారు. అయితే ఇలా ఎక్కువగా చూడటం వల్ల కళ్లు మండి కొందరు రుద్దుతారు. కొంచెం కళ్లను రుద్దితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఎక్కువగా కళ్లను రుద్దితే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా రుద్దితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్, అలెర్జీ వంటివి వస్తాయి. ముఖ్యంగా సీజన్ లో అయితే అసలు కళ్లను రుద్దకూడదు. ఇలా రుద్దడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మరి చూద్దాం.

    కొందరికి ఎక్కువగా కళ్లు దురదగా ఉంటాయి. బయట దుమ్ము లేదా ధూళి ఉన్న కూడా కొన్ని సార్లు కళ్లను రుద్దుతాం. అయితే ఎక్కువగా కళ్లను రుద్దితే కార్నియ ఆకారం అనేది మారుతుంది. సాధారణంగానే కళ్లలోని రక్తనాళాలు చాలా మృదువుగా ఉంటాయి. ఎక్కువగా కళ్లను రుద్దితే ఈ నాళాలు విరిగిపోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా విరిగిపోతే కళ్లలోని తెల్లటి పొరలో రక్తస్రావం అవుతుంది. అలాగే కళ్లు ఎర్రగా మారి.. చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఎక్కువగా కళ్లను రుద్దితే పెద్ద వారిలో కెరాటోకోనస్ అనే వ్యాధి వస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ వ్యాధి వస్తే సరిగ్గా చూడలేరు. అలా వయస్సు పెరిగే కొద్ది.. కంటి సమస్యలు వస్తాయి. కాబట్టి కళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్క్రీన్ టైం ఎక్కువగా ఉండేలా చూసుకోకూడదు. అప్పుడే కంటి సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది.

    కళ్ల సమస్యలు ఏవి రాకుండా ఉండాలంటే.. బాడీకి సరిపడా నీరు తీసుకోవాలి. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. చేపలు, క్యారెట్, దోసకాయ, బీట్‌రూట్, క్యాప్సికం, ముల్లంగి, పచ్చి కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోవాలి. బయటకు వెళ్లినప్పుడు కళ్లకు దుమ్ము, ధూళి పడకుండా గ్లాస్సెస్ పెట్టుకోవాలి. ఎక్కువగా స్క్రీన్ చూడకూడదు. ఒకవేళ చూడాల్సి వస్తే ఒక 30 నిమిషాలకు బ్రేక్ ఇవ్వండి. పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. వీలైనంత వరకు మొబైల్, లాప్ టాప్ వంటి వాటికీ దూరంగా ఉండాలి. అప్పుడే కళ్ల సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.