https://oktelugu.com/

అత్యధిక మైలేజ్ ఇచ్చే హ్యాచ్ బ్యాక్ కారు ఇదే..

టాటా మోటార్స్ కు చెందిన బెస్ట్ హ్యాచ్ బ్యాక్ కారు ఏదంటే టియాగో అని నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఈ కారులో ఉండే ఫీచర్స్, ఇంజిన్ తదితర విషయాలో కారు వాడే వారిని బాగా ఆకర్షిస్తున్నాయి. టాటా టియాగో ఇంజిన్ విషయానికొస్తే.. 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్ కూడా ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 24, 2024 / 03:59 PM IST

    Tata Tiago safety car

    Follow us on

    కార్ల మార్కెట్లో మారుతి కంపెనీకి గట్టి పోటీ ఇచ్చే కంపెనీ ఏదంటే టాటా అని మాత్రమే అని చెప్పొచ్చు. హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు వివిధ మోడళ్లను తీసుకువచ్చి ఇతర కంపెనీల కార్లకు గట్టి పోటీ ఇస్తుూ ఉంటుంది. లేటేస్టుగా టాటా కంపెనీకి చెందిన ఓ మోడల్ మైలేజ్ విషయంలో దూసుకుపోతుంది. ఓ బుల్లెట్ ఇచ్చే మైలేజ్ ని ఇస్తూ ఆకట్టుకుంటోంది. దీంతో మోడల్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇంతకీ ఆ కారు ఎదో తెలుసా?

    టాటా మోటార్స్ కు చెందిన బెస్ట్ హ్యాచ్ బ్యాక్ కారు ఏదంటే టియాగో అని నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఈ కారులో ఉండే ఫీచర్స్, ఇంజిన్ తదితర విషయాలో కారు వాడే వారిని బాగా ఆకర్షిస్తున్నాయి. టాటా టియాగో ఇంజిన్ విషయానికొస్తే.. 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్ కూడా ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. అయితే కారు సీఎన్ జీ ఎంపికలో 73.5 బీహెచ్ పీ పవర్ తో పాటు 95 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

    టాటా టియాగో ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో రక్షణ కోసం ప్రత్యేకంగా ఫీచర్లను అమర్చారు. 4 స్టార్ రేటింగ్ తో కూడిన హ్యాచ్ బ్యాక్ కారులో 2 స్టాండర్ట్ ఎయిర్ బ్యాగులు, సెన్సార్ పార్కింగ్, ఈబీడీ తో కూడి ఏబీఎస్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక దీనిని రూ.5.65 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ లో 8.90 లక్షలతో విక్రయిస్తున్నారు.

    మారుతి ఎవర్ గ్రీన్ మోడల్ వ్యాగన్ ఆర్ కు గట్టి పోటీ ఇచ్చే కారుగా టియాగో నిలుస్తోంది. ఈ మోడల్ లీటర్ పెట్రోల్ కు 24 నుంచి 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చింది. సీఎన్ జీ వేరియంట్ లో 28.06 కిలోమీటర్ల వవరకు ఇస్తుంది. అయితే ఈ హ్యాచ్ బ్యాక్ కార్లల మైలేజ్ విషయంలో ఇతర వాహనాల కంటే టియాగో మెరుగ్గా ఉండడం విశేషం.