https://oktelugu.com/

Meena: మీనా హుక్ స్టెప్ మామూలుగా లేదుగా.. వామ్మో అదిరే వీడియో..

త్వరలోనే సినిమా రావడానికి సిద్ధం అవుతుండడంతో ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా ఇటీవల పుష్పా పుష్పా అనే సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 24, 2024 / 04:01 PM IST

    Meena

    Follow us on

    Meena: పుష్ప సినిమా మానియా ఏ రేంజ్ లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ వల్ల పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలోని పాటలు, డైలాగులు, స్టెప్పులు ఏ రేంజ్‌లో హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు ‘అంతకు మించి’ అంటూ పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అయింది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ సీక్వెల్ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    త్వరలోనే సినిమా రావడానికి సిద్ధం అవుతుండడంతో ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా ఇటీవల పుష్పా పుష్పా అనే సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్ కూడా యూట్యూట్‌ లో రికార్డులు కొల్లగొడుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ సాంగ్ దే హవా నడుస్తోంది. ఈ సాంగ్ లో బన్నీ వేసిన హుక్ స్టెప్ కు లైక్స్, కామెంట్స్, షేర్ లను చూస్తే మామూలుగా లేవు. షూస్ విప్పి కాలు మీద కాలు వేసుకుని చేసే స్టెప్ అందరినీ ఆకర్షించింది.

    ఏదైనా స్టెప్ వైరల్ గా మారితే కచ్చితంగా దాని మీద రీల్స్ వస్తుంటాయి. అలాంటిది బన్నీ హుక్ స్టెప్ మీద రీల్స్ రాకుండా ఉంటాయా? అదే మాదిరి ఈ హుక్ స్టెప్ ను అనుకరిస్తూ ఇన్ స్టా, యూట్యూబ్ లో రీల్స్ చేసుకుంటున్నారు. సినిమా సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్స్ సైతం పుష్ప 2 హుక్ స్టెప్ ను వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ కూడా అల్లు అర్జున్ పుష్ప 2 స్టెప్ వేసింది. తను ఎవరో కాదు మీనా.ఈమె ఏకంగా మంచు కొండల్లో ఈ స్టెప్ వేసి అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

    ఇటీవల యూరప్‌ లోని ఓ ఐస్‌లాండ్‌కు విహారయాత్రకు వెళ్లింది మీనా. తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడూ షేర్ చేస్తుంటూనే ఈ వీడియోను కూడా పంచుకుంది. అలా మంచు ద్వీపం నుంచి పుష్ప 2 హుక్ స్టెప్ ను రీక్రియేట్ చేసింది ఈ నటి. ఆ వీడియోను నెట్టింట షేర్ చేసుకోగా అది కాస్తా వైరల్ గా అవుతుంది. ఇక ఈ వీడియోకు కాప్షన్ గా డెడ్లీ కాంబినేషన్.. మంచు అగ్ని కలయిక అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది.