https://oktelugu.com/

SUV కార్లలో బెస్ట్ 5 ఇవే.. గత నెలలో ఎన్ని అమ్మారో తెలుసా?

దేశంలోని కార్ల ఉత్పత్తి కంపెనీల్లో హ్యుందాయ్ ప్రత్యేకతను చాటుకుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన క్రెటా బెస్ట్ ఎస్ యూవీగా నిలిచింది. అంతేకాకుండా దీని అమ్మకాలు టాప్ 1 లెవల్లో ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటాను 2024 ఏప్రిల్ నెలలో 15,447 మంది వినియోగదారులు సొంతం చేసుకున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 24, 2024 3:58 pm
    SUV Cars

    SUV Cars

    Follow us on

    నేటి కాలంలో ఎస్ యూవీలను ఎక్కువ మంది కోరుకుంటున్నారు. దీంతో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా SUV కార్లను ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తూ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఎన్ని మోడళ్లు మార్కెట్లోకి వచ్చినా టాప్ లెవల్లో కొన్ని మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఎస్ యూవీ కార్లు అనగానే రూ.10 లక్షలకు పైమాటే. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ఎస్ యూవీల్లో లో బడ్జెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధిక డిమాండ్ ఉన్న 5 ఎస్ యూవీల గురించి తెలుసుకుందాం..

    దేశంలోని కార్ల ఉత్పత్తి కంపెనీల్లో హ్యుందాయ్ ప్రత్యేకతను చాటుకుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన క్రెటా బెస్ట్ ఎస్ యూవీగా నిలిచింది. అంతేకాకుండా దీని అమ్మకాలు టాప్ 1 లెవల్లో ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటాను 2024 ఏప్రిల్ నెలలో 15,447 మంది వినియోగదారులు సొంతం చేసుకున్నారు.

    ఎస్ యూవీ కార్ల ఉత్పత్తికి పెట్టింది పేరు మహీంద్రా అండ్ మహాంద్రా. ఈ కంపెనీ నుంచి ఎన్నో ఆకట్టుకునే మోడళ్లు వచ్చాయి. దీని నుంచి రిలీజ్ అయిన స్కార్పియో బెస్ట్ ఎస్ యూవీగా పేరు వచ్చింది. దీనిని ఒక్క ఏప్రిల్ నెలలోనే 14,807 మంది కొనుగోలు చేశారు.

    మారుతి కార్లను ఎక్కువ మంది లైక్ చేస్తారు. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లను ఈ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే గ్రాండ్ విటారా ఎస్ యూవీ అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకుంటోంది. గత నెలలో ఈ కారు 7,651 తో మూడో స్థానంలో నిలిచింది.

    కియా కార్లు ఈ మధ్య రేసు గుర్రంలా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే కియా ఎస్ యూవీ కార్లకు డిమాండ్ బాగా ఉంది. లేటేస్ట్ గా కియా కంపెనీ నుంచి రిలీజ్ అయిన సెల్టోస్ ను గత నెలలో 6,734 మంది కొనుగోలు చేశారు. దీంతో ఈ మోడల్ టాప్ 4లో నిలిచింది.

    టయోటా కంపెనీ నుంచి ఇన్నోవా ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ విపరీతంగా అమ్మకాలు జరుపుకుంటోంది. గత నెలలో ఈ కారు 3,252 యూనిట్లు అమ్ముడుపోయాయి.