Income Tax:  ఆదాయపు పన్నును సులువుగా ఆదా చేసే మార్గాలు ఇవే.. ఏమేం చేయాలంటే?

Income Tax:  మనలో చాలామంది ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉంటారు. పన్ను ఆదా చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. 80సీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులు సులభంగా ఆదాయపు పన్నును ఆదా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లకు ఏకంగా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆదాయపు పన్ను చెల్లించేవాళ్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పాలసీలలో ఇన్వెస్ట్ చేయడానికి అసలు […]

Written By: Navya, Updated On : January 12, 2022 12:37 pm
Follow us on

Income Tax:  మనలో చాలామంది ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉంటారు. పన్ను ఆదా చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. 80సీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులు సులభంగా ఆదాయపు పన్నును ఆదా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లకు ఏకంగా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది.

Income Tax

ఆదాయపు పన్ను చెల్లించేవాళ్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పాలసీలలో ఇన్వెస్ట్ చేయడానికి అసలు కారణం ఇదేనని చెప్పవచ్చు. కొన్ని పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే పన్నును ఆదా చేసుకోవడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. ఇతర దేశాల నుంచి గిఫ్ట్ రూపంలో వచ్చే డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు.

Also Read: మొన్న ఎన్టీఆర్, నిన్న బన్నీ, నేడు ప్రభాస్.. ఎవర్నీ వదట్లేదుగా !

అయితే ఇతర దేశాల నుంచి వచ్చే మొత్తం 2.5 లక్షల రూపాయల లోపు ఉంటే మాత్రమే పన్నును చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ మొత్తం 2.5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొదటి ఇల్లు కొనే సమయంలో, రెండో ఇల్లు కొనే సమయంలో పన్ను మినహాయింపు బెనిఫిట్స్ లభిస్తాయి. వికలాంగులు కూడా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన వాళ్లు సైతం పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ ఉంటుంది. పిల్లల కోసం విద్యా రుణం తీసుకునే తల్లిదండ్రులు సైతం పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు.

Also Read: బయటపడిన సముద్ర డ్రాగన్ అస్తిపంజరం.. 30 అడుగుల పొడవు.. తల బరువు ఒక టన్ను..!