Eectric Cars: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలు ఉన్న వాటి స్థానంలో విద్యుత్ కార్లను మార్చుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది కొత్తగా కారు కొనాలనుకునేవారు ఎలక్ట్రిక్ వేరియెంట్ పై వెళ్తున్నారు. కంపెనీని సైతం వినియోగదారులకు అనుగుణంగా కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ ఎక్కువగా పెరిగాయి. వీటిలో కొన్ని కంపెనీలు ఎక్కువగా మరికొన్ని కంపెనీలను తక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాయి. ఇందులో టాటా, ఎంజి మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ప్రముఖంగా నిలిచాయి. ఇటీవల బయటకు వచ్చిన జాబితా ప్రకారం ఏ కంపెనీ ఎన్ని వాహనాలు విక్రయించిందో తెలుసుకుందాం..
ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడంలో TATA కంపెనీ ముందు ఉంది. 2025 జనవరిలో టాటా సంస్థ 5,047 ఎలక్ట్రిక్ కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదే జనవరిలో 5,082 టాటా వాహనాలను వినియోగదారులు కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టాటా కార్లు జనవరిలో తక్కువగానే ఉన్నాయి. కానీ గత ఏడాది డిసెంబర్ తో పోలిస్తే మాత్రం ఈ ఏడాది జనవరిలో టాటా సంస్థ 1000 కారులను ఎక్కువ గా అమ్మింది. టాటా లో కర్వ్ వంటి వాహనానికి ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. దీనిని కొనేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు.
టాటా కంపెనీకి ఎంజి మోటార్స్ గట్టి పోటీ ఇస్తుంది. ఈ కంపెనీకి చెందిన వాహనాలు 2025 జనవరిలో 4,237 గా ఉన్నాయి. అయితే గత ఏడాది జనవరిలో ఈ కంపెనీ 1,203 యూనిట్లు మాత్రమే విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో కార్ల విక్రయాలు వృద్ధి సాధించాయి. గత ఏడాది డిసెంబర్లో 3643 యూనిట్లు విక్రయించారు. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా విక్రయించిన వాటిలో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో 68 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఈ సంస్థల తర్వాత హుందాయి, బివైడి సంస్థలు నిలిచాయి. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్లు ఏడో స్థానంలో నిలిచాయి.
అయితే కంపెనీలపరంగా చూస్తే సేల్స్ వృద్ధి శాతం లో ఎంజి మోటార్స్ మిగతా వాటికంటే ముందు వరుసలో ఉంది. ఈ కంపెనీకి చెందిన విద్యుత్ వాహనాలను ఎక్కువ మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ కంపెనీ కార్లు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉంటున్నాయి. అయితే టాటా వంటి కంపెనీలు అధిపత్యాన్ని కొనసాగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది వరకు ఈ కంపెనీల మధ్య పోటీ ఉండి ఎక్కువ విక్రయాలు జరుపుకునే అవకాశం ఉంది. అయితే మారుతి వంటి కంపెనీలు ఇప్పుడిప్పుడే కొత్తకాలను తీసుకొస్తున్న వాటి పనితీరు బాగుంటే ప్రస్తుతం ఉన్న కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే వినియోగదారులు ధర విషయం ఆలోచిస్తే మాత్రం ఎంజి మోటార్స్ వైపు ఎక్కువగా మల్లుతున్నారని కొన్ని నివేదికల ద్వారా బయటపడుతుంది.