Nayanathara Children
Devara Song : గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఎన్టీఆర్(Junior Ntr) ‘దేవర'(Devara Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఎన్టీఆర్ స్టామినా తో పాటు, సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన బ్లాక్ బస్టర్ ఆల్బం కూడా ఒక కారణం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సినిమాలోని పాటలు అన్ని వయస్సులకు సంబంధించిన వారు ఎంజాయ్ చేయడం ఈ సినిమాకే జరిగింది. యూత్ ఆడియన్స్ ‘దూకే ధైర్యమా జాగ్రత్త’ అనే పాట ఎంత కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా మాస్ ఆడియన్స్ కి ‘జాతర’ సాంగ్ ఒక రేంజ్ లో నచ్చేసింది. ఇక క్లాస్ ఆడియన్స్ అయితే ‘చుట్టమల్లే’ సాంగ్ కి ఎంత కనెక్ట్ అయ్యారో మనం కళ్లారా చూసాము.
విడుదల రోజు థియేటర్స్ అన్ని ఈ పాటకు కన్సర్ట్స్ లాగా మారిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే కేవలం పాటల కోసమే ఈ సినిమాకి వెళ్లిన ఆడియన్స్ లక్షల్లో ఉంటారేమో అని విశ్లేషకుల అభిప్రాయం. ఈ సినిమాలోని పాటలు ఆడియన్స్ కి ఎంతలా నచ్చిందో చెప్పడానికి ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకొస్తున్నాము. రీసెంట్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) తన భర్త, పిల్లలతో కలిసి కారులో వెకేషన్ ట్రిప్ కి బయలుదేరుతుంది. కార్ లో ఉన్న సమయంలో ‘చుట్టమల్లే’ సాంగ్ తమిళ వెర్షన్ ప్లే అవ్వడం, దానికి నయనతార పిల్లలు వైబ్ అవుతూ ఎంజాయ్ చేయడం చూసేందుకు చాలా క్యూట్ గా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ సినిమాలోని పాటలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయి అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
ఈమధ్య కాలం లో ఒక సినిమా ఫలితాన్ని, కేవలం పాటలు నిర్ణయిస్తున్నాయి అని చెప్తే మీరెవరైనా నమ్ముతారా..?, కానీ అది పచ్చి నిజం, నమ్మక తప్పదు.ఉదాహరణకి ఈ ఏడాది విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘తండేల్’ చిత్రాలను తీసుకుందాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో గోదారి గట్టు మీద సాంగ్ ఎంత పెద్ద అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో చూడాలి అని ఫ్యామిలీ ఆడియన్స్ మొండిపట్టు పట్టేలా చేసింది. సినిమా విడుదల తర్వాత మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, 300 కోట్లు రాబట్టింది, అంత బానే ఉంది, కానీ విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ఆ రేంజ్ లో జరగడానికి కారణం మాత్రం ఈ చిత్రంలోని పాటలే. ఇక రీసెంట్ గా విడుదలైన ‘తండేల్’ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఆడియో బ్లాక్ బస్టర్ అవ్వడంతో కేవలం పాటల కోసం థియేటర్స్ కి వెళ్లారు ఆడియన్స్. రాబోయే పాన్ ఇండియన్ చిత్రాలకు కూడా ఇప్పుడు కచ్చితంగా ఒక పాట క్లిక్ అవ్వడం ముఖ్యం.