Rajamouli
Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికి రాజమౌళికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఆయన లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం. ఒక సీన్ ని ఏ లెవెల్లో తీయాలి, ఎలా చేస్తే ప్రేక్షకుడు ఎమోషనల్ గా సినిమాకి కనెక్ట్ అవుతాడు అనే పాయింట్స్ ని బాగా తెలుసుకున్న దర్శకుడు రాజమౌళి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి (Rajamouli) తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు(Mahesh Babu) తో కలిసి ముందుకు నడుస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడనే విషయం మనకు తెలిసిందే. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది. ఆయనంటే ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది దర్శకులకి రెస్పెక్ట్ అయితే ఉంటుంది. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఇక ప్రస్తుతం తెలుగు సినిమా స్టాండర్డ్ ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన క్రెడిట్ కూడా రాజమౌళి ఖాతాలోకి వెళుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇదిలా ఉంటే రాజమౌళి రమా రాజమౌళి ని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక తను చిన్నతనంలో ఉన్నప్పుడు అతనికి ఒక స్టార్ హీరోయిన్ అంటే చాలా ఇష్టం ఉండేదట. ఇంతకీ ఆవిడ ఎవరు అంటే సావిత్రి…
చిన్నప్పుడు సినిమాల్లో చూసిన ప్రతిసారి సావిత్రి అంటే ఇష్టం ఉండడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. ఇక చిన్నతనంలో అలాంటి క్రష్ ఉండడం అనేది కామన్ గా జరిగిపోతుంది. కాబట్టి తను పెళ్లి చేసుకోవాలనుకున్న కూడా సావిత్రి తనకంటే చాలా పెద్దదని అప్పటికే ఆమెకి పెళ్లైందని తనకు తాను సమాధానం చెప్పుకునేవారట…
ఒకవేళ సావిత్రి (Savithri) కనక ఇప్పటివరకు బతుకుంటే ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఆమెను పెట్టి ఆమెతో నటింపజేసేవారట…ఇక రాజమౌళి కొన్ని సందర్భాల్లో ఈ విషయాలను తెలియజేయడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచుతూ ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో రాజమౌళి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం తో ముందుకు సాగుతున్నాడు. అందుకే తమ కెరియర్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా మహేష్ బాబుతో సినిమా చెయ్యని రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా కోసం మహేష్ బాబును ఎంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాబట్టి అనుకున్న సమయానికి ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురావడానికి రాజమౌళి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు…