https://oktelugu.com/

Best Automatic Cars: దేశంలో అత్యుత్తమ ఆటోమేటిక్ కార్లు ఇవే.. ధర ఎంతో తెలుసా?

మారుతి సుజుకీ కంపెనీకి చెందిన వ్యాగన్ ఆర్ అత్యుత్తమ ఆటోమేటిక్ హ్యాచ్ బ్యాక్ గేర్ బాక్స్ కారుగా చెప్పుకోవచ్చు.అమ్మకాల్లో ఇది నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. 1.0 లీటర్ పెట్రోల్ ఫ్యూయెల్ తో ఉన్న ఈ మోడల్ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 22, 2024 / 03:49 PM IST

    Best Automatic Cars

    Follow us on

    Best Automatic Cars: కారు కొనుగోలుదారులను ఆకర్షించడానికి కంపెనీలు డిఫరెంట్ మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు.. తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ ధర వరకు అన్ని రకాల కార్లను విక్రయిస్తున్నారు. ఈమధ్య SUVలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొందరు హ్యాచ్ బ్యాక్ కార్ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఉత్పత్తి చేసిన అతి చిన్న ఆటోమేటిక్ గేర్ బాక్స్ కార్లు ఆకర్షిస్తున్నాయి. కొన్ని కంపెనీలకు చెందిన అత్యుత్తమ ఆటోమేటిక్ కార్ల గురించి తెలుసుకుందాం..

    మారుతి సుజుకీ కంపెనీకి చెందిన వ్యాగన్ ఆర్ అత్యుత్తమ ఆటోమేటిక్ హ్యాచ్ బ్యాక్ గేర్ బాక్స్ కారుగా చెప్పుకోవచ్చు.అమ్మకాల్లో ఇది నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. 1.0 లీటర్ పెట్రోల్ ఫ్యూయెల్ తో ఉన్న ఈ మోడల్ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. దీనిని రూ.6.41 లక్షల ఎక్స్ షోరూం ధరతో విక్రయిస్తున్నారు. ఆ తరువాత హ్యుందాయ్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ 10 కూడా 5 స్పీడ్ ఏఎంటీ గా చెప్పుకోవచ్చు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఫ్యూయెల్ ను కలిగి ఉంది. దీనిని రూ.6.78 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    మారుతి కంపెనీకి చెందిన మరో మోడల్ సెలెరియో 1.0 లీటర్ పెట్రోల్ తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారు రూ.6.24 లక్షల ప్రారంభ ధర ఉంది. టాటా టియాగో 1.2 లీటర్ పెట్రోల్ ఫ్యూయెల్ ను కలిగిన ఈ కారు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. దీనిని రూ.6.55 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ లో రూ.7.38 లక్షల వరకు విక్రయిస్తున్నారు. రెనాల్ట్ కంపెనీకి చెందిన క్విడ్ 1.0 లీటర్ పెట్రోల్ ఫ్యూయెల్ ను కలిగి ఉంది. ఇది 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స తో రూ.5.79 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    ఓ వైపు విశాలమైన స్పేస్ తో ఎస్ యూవీలు వస్తున్న తరుణంలో చిన్న ఫ్యామిలీ వారు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో సొంతంగా వెహికల్ ఉండాలనుకునేవారు హ్యాచ్ బ్యాక్ ల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ కార్లకు డిమాండ్ పెరుగుతోంది.