Motorola Edge 40 Features: నేటి కాలంలో మొబైల్ కొనాలని అనుకునేవారు Motorola కంపెనీకి చెందిన ప్రోడక్ట్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ కంపెనీ సైతం యూత్ తో పాటు సాధారణ వినియోగదారులకు అనుగుణంగా ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. Motorola Edge 40 పేరుతో మార్కెట్లో ఉన్న ఈ మొబైల్ అందరిని ఆకర్షిస్తుంది. చూడ్డానికి ఆకర్షణీయమైన డిజైన్తో పాటు Poled డిస్ప్లే ని కలిగి ఉన్న ఇందులో బ్యాటరీ సామర్థ్యం, సాఫ్ట్వేర్ వంటివి రోజువారి అవసరాలకు ఉపయోగించేవారికి అనుగుణంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే మోటరోలా మొబైల్ పై ఆసక్తి ఉన్నవారు ఈ ఫోన్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అసలు ఇందులో ఉన్న స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతి మొబైల్ లో Display గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. Motorola edge 40 మొబైల్లో 6.5 అంగుళాల Poled డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 144 రిప్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీంతో ఇందులో వీడియోలు కొత్త అనుభూతితో ఆస్వాదించవచ్చు. అలాగే గేమింగ్ కోరుకునే వారికి ఇది అనుకున్న విధంగా ఉంటుంది. ప్రత్యేకంగా మూవీస్ చూసేవారికిHDR అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో Media tek Demensity 8020 ప్రాసెసర్ పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ తో కాల్ చేయడం, మెసేజ్ పంపించుకోవడం, బ్రౌజింగ్ వాటి విషయంలో ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేయగలుగుతుంది. సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించేవారికి తగినంత సపోర్టు ఇస్తుంది. ఎన్నో అవసరాలకు ఉపయోగపడే విధంగా 8 GB రామ్ ను అమర్చారు. అలాగే 256 జీబీ స్టోరేజ్ తో ఉండడంతో కావాల్సిన ఫొటోస్, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ కోసం ఉపయోగించేవారికి ఇది అనుగుణంగా ఉంటుంది.
Motorola edge 40 మొబైల్లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా 50 MP ప్రధాన కెమెరాను అమర్చారు. ఇది అన్ని రకాల సమయాల్లో ఫోటోలు తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఆల్ట్రా వైడ్ కెమెరా తో పాటు ల్యాండ్ స్కేప్ షాట్స్ కూడా దీని ద్వారా పొందవచ్చు. సెల్ఫీ కెమెరా కూడా అద్భుతమైన మెగాపిక్సల్ ఉండడంతో సెల్ఫీ వినియోగదారులకు ఈ మొబైల్ స్పష్టమైన ఫోటోలను అందిస్తుంది. సోషల్ మీడియా యూజ్ చేసే వారికి కావలసిన ఫోటోలను అందిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ జరపడానికి ఇందులో బలమైన బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ మొబైల్లో 4400 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అమర్చారు. దీంతో ఎలాంటి వినియోగదారులకైనా ఇది రోజంతా వచ్చేలా ఉపయోగపడుతుంది. అలాగే డౌన్ టైం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా బ్రౌజింగ్ చేసే వారికి ఈ చార్జింగ్ సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే ఎక్కువగా చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
అలాగే ఈ మొబైల్లో 5జి కనెక్టివిటీ అద్భుతంగా ఉండడంతో ఇలాంటి ప్రదేశంలోనైనా కావలసిన ఇంటర్నెట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ ప్రస్తుతం మార్కెట్లో రూ.26,999 ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు.