Boduppal: హైదరాబాదులోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటీవల ఓ వ్యక్తి మరణానికి సంబంధించిన కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసులో పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో.. ఏం చేయాలో తెలియక పక్కన పెట్టారు. చివరికి వారికి ఒక ఆధారం లభించడంతో తవ్వుకుంటూ వెళ్లారు. ఫలితంగా వారు ఊహించని కోణం ఈ కేసులో కనిపించింది.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో అశోక్ అనే వ్యక్తి తన భార్య పూర్ణిమతో కలిసి జీవిస్తున్నాడు. ఇతడు ఒక లాజిస్టిక్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అశోక్, పూర్ణిమ మధ్య వైవాహిక బంధం మొదట్లో బాగానే ఉండేది. ఆ తర్వాతే మూడో వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించడంతో కథ మారిపోయింది..
ఇటీవల అశోక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పూర్ణిమ తన భర్త గుండెపోటుతో చనిపోయాడని పోలీసుల ఎదుట వాపోయింది. పోలీసులు ఏ మాత్రం అనుమానం వ్యక్తం చేయకుండా కన్నీరు పెట్టింది. దీంతో పోలీసులు కూడా అతనిది గుండెపోటు మరణం అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత వారు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయాన్ని బయటపెట్టారు..
పూర్ణిమ మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అశోక్ కు అనుమానం రావడంతో ఆమెను నిలదీశాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ రూపొందించింది. ఇంట్లోనే తన చున్నీతో అశోక్ మెడకు బిగించింది. దీనికి ఆమె ప్రియుడు కూడా సహకరించాడు. అతడు చనిపోయాడని నిర్ధారించిన తర్వాత.. గుండెపోటు వచ్చి కన్నుమూశాడని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది పూర్ణిమ. అయితే పోలీసులకు హనుమాన్ రావడంతో సిసిటివి లో దృశ్యాల ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. మిగతా సాంకేతిక ఆధారాలు సంపాదించిన పోలీసులు పూర్ణిమ, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, ద్విచక్ర వాహనం, ఇతర సాంకేతిక పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.