https://oktelugu.com/

Income of these employees: తెగ కట్టేస్తున్నారు.. ఈ ఉద్యోగుల ఆదాయం రూ.500 కోట్లు.. ఈ పదేళ్లలో ఎంత పెరిగిందంటే?

దేశంలో వ్యక్తులు, సంస్థలు పొందే ఆదాయం పరిమితి కంటే ఎక్కువ ఉంటే పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది ఆర్థిక సంవత్సరం చివరి సమయంలో ఆదాయం పన్నుకు సంబంధించి ఫైలును దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు అధిక ఆదాయం ఆర్జిస్తున్నా ప్రభుత్వానికి సరైన పన్నును చెల్లించలేరు

Written By:
  • Srinivas
  • , Updated On : October 22, 2024 2:41 pm
    Income

    Income

    Follow us on

    Income of these employees: దేశంలో వ్యక్తులు, సంస్థలు పొందే ఆదాయం పరిమితి కంటే ఎక్కువ ఉంటే పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది ఆర్థిక సంవత్సరం చివరి సమయంలో ఆదాయం పన్నుకు సంబంధించి ఫైలును దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు అధిక ఆదాయం ఆర్జిస్తున్నా ప్రభుత్వానికి సరైన పన్నును చెల్లించలేరు. కానీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పన్ను చెల్లింపులు పెరిగాయి. 2003-2004 సంవత్సరానికి వ్యక్తులు దాఖలు చేసిన పన్ను ఫైల్స్ విలువ 4.4 కోట్లు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.8.61 కోట్ల కు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో వ్యాపారుల కంటే ఉద్యోగులు చెల్లించిన ఆదాయపు పన్ను ఎక్కువగా ఉండడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే..

    ఆదాయపు పన్ను కు సంబంధించిన వివరాల ప్రకారం గత పదేళ్లలో ఆదాయపు పన్ను ే వసూలు శాతం రెండు రేట్లు పెరిగింది. 2013-2014 కాలంలో 4.04 కోట్ల ఐటీఆర్ లు దాఖలయ్యాయి. 2023-24 లో వీరి సంఖ్య 8.61 కోట్లకు చేరుకుంది.2013-2014 పన్ను చెల్లింపు దారుల సంఖ్య 3.3 కోట్లు ఉండగా.. 2023-24లో 7.7 కోట్లుకు చేరకుంది. అంటే పన్ను చెల్లించే వారి సంఖ్య 5.5 రేట్లు పెరిగింది.

    పదేళ్ల పన్ను చెల్లింపుల్లో వ్యాపారుల కంటే ఉద్యోగులు చెల్లించన ఆదాయపు పన్ను ఎక్కువగా ఉంది. వీరిలో 1.5కోట్ల జీతం పోందే వారి శాతం ఏకంగా 53 శాతం పెరిగింది. 2013-2014 సంవత్సరంలో 100 నుంచి 500 కోట్ల వరకు జీతాలు పొందిన వారిలో ఇద్దరు మాత్రమే పన్ను చెల్లించేవారు. కానీ 2023-24 లో 23 మందిలో 19 ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023-14తో పోలిస్తే 2023-24 స్థూల జాతీయ ఆదాయం 5.5 లక్షల కోట్ల నుంచి 9.5 లక్షల కోట్లకు పెరిగింది. పదేళ్ల కిందట 18 శాతం రిటర్న్స్ ఉండగా..తాజా ఏడాదిలో 23 శాతం వాటాను కలిగి ఉంది.

    అయితే వ్యక్తిగత ఆదాయంతో పాటు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. 2014-15 సంవత్సరంలో పన్నుల వసూళ్లు 6.96 లక్షల కోట్లు ఉన్నాయి. 2023-24 ఏడాది వరకు 10.45 లక్షల కోట్లకు చేరింది. మొత్తంగా 4 రేట్లు పన్నుల శాతం పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

    దేశంలో ప్రభుత్వం ఆదాయం పొందేందుకు వివిధ రకాల పన్నులను విధిస్తుంది. వీటిలో పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు ఉన్నాయ. అయితే పదేళ్లను బట్టి చూస్తే ప్రత్యక్ష పన్నుల ద్వారా అధిక ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్నుపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల్లో వస్తున్న మార్పుల కారణంగా ఈ పరిస్థితి వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదాయపు పన్నుతో పాటు ఇతర పన్నులు చెల్లించే వారికి రిబేట్ కల్పించడం, వివిధ ప్రోత్సాహకాలను అందుబాటులోకి తీసుకురావడంతో పన్నుల శాతం పెరిగిందని తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశం ఉందని నిపుణులు అంటారు.