TESLA : ప్రపంచం అంతా ఇప్పుడు Electric Cars కోరుకుంటున్నారు. చాలా కంపెనీలు సైతం విద్యుత్ కార్ల ఉత్పత్తిలో ప్రత్యేక ప్రణాళికలు వేసుకుంటున్నాయి. కానీ ఇప్పటికీ వరల్డ్ లెవల్లో Tesla కార్లకు ప్రత్యేక డిమాండ్ ఉంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పడు భారత ఆటోమోబైల్ మార్కెట్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి వెళ్లేందుకు తీవ్రంగా పోటీ పడుతోంది. ఈ క్రమంలో ఇక్కడ కొన్ని విదేశీ కంపెనీలు తమ కార్ల ఉత్పత్తుల ప్లాంట్లను నెలకొల్పాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ కార్లు విక్రయిస్తున్న TESLA కంపెనీ తన ప్లాంట్ ను భారత్ లో నెలకొల్పుతున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే ఇండియాలో తన మొదటి ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబోతుందన్న విషయం ఆసక్తి నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితె..
Also Read : ఏపీకి టెస్లా.. ఏకంగా పోర్ట్ ఆఫర్.. ఆ రెండు రాష్ట్రాలు వెనక్కి!
ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, TESLA కంపెనీ అధినే ఎలన్ మస్క్ భేటీ అయిన విషయం వార్తల్లో చూశాం. దీంతో ఏం జరగబోతుందని? తవ్ర చర్చ సాగింది. TESLA కార్లకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చ సాగినట్లు తెలిసింది. అందులో భాగంగానే TESLA కంపెనీ వేగంగా తన ప్రయత్నాలను ప్రారంభించింది. భారత్ లో తన ప్లాంట్ ను నెలకొల్పి ఇక్కడి నుంచి విదేశాలకు కార్లను ఎగుమతి చేయాలని అనుకుంది. అయితే భారత్ లో ఎక్కడ ఈ ప్లాంట్ నెలకొల్పాలి? అనే చర్చ సాగుతున్న సమయంలో ముంబై నగరాన్ని ప్రధానంగా ఎంచుకున్నారు.
మహారాష్ట్రలోని ముంబై లో అత్యంత ఖరీదైన ప్రదేశం బాంద్రా కుర్లా కాంప్లెక్స్. ఇక్కడ నివసించడానికైనా.. సంస్థలను నెలకొల్పడానికైనా భారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే TESLA కంపెనీ తన ప్లాంట్ ను ఇక్కడే నెలకొల్పాలని చూస్తోంది. ఇది అత్యంత ఖరీదైన ప్రదేశం అయినా కూడా ఇక్కడే తన కార్యకలాపాలను ప్రారంభించాలని చూస్తుందంటే.. ఇండియా మార్కెట్ ఎంత అభివృద్ధి చెందుతుంతో తెలుసుకోవచ్చు.ఇక్కడ తన షోరూం అవసరాలకు దాదాపు 4 వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం నెలకు రూ.35 లక్షలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.
TESLA కంపెనీ ముంబైలో ప్లాంట్ ను ప్రారంభించిన తరువాత ఢిల్లీలో కూడా మరో ప్లాంట్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తరువాత దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ప్లాంట్లు ఉంటాయని అంటున్నారు. అయితే దేశంలో ఇప్పటికే వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని కార్లు ఖరీదైన కార్లను కూడా రిలీజ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో TESLA కంపెనీ తన ప్లాంట్ ద్వారా మరింత కార్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా TESLA కంపెనీ ప్రారంభం తరువాత ఉద్యోగులను నియమించుకునేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ప్లాంట్ కు సంబంధించిన సిబ్బందిని కోరుతూ నోటిఫికేషన్ ను సోషల్ మీడియాలో ఉంచింది. అంటే ఈ కంపెనీ ద్వారా కొంత మందికి ఉపాధి కూడా కలిగే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read : భారత్ మార్కెట్లోకి కేవలం రూ.22లక్షలతో ఎంట్రీ ఇస్తున్న టెస్లా కారు.. లబోదిబో అంటున్న కార్ల కంపెనీలు