Star Director : ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరక్టర్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే వాళ్ళు చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇప్పటికే రాజమౌళి లాంటి దర్శకుడు చేస్తున్న ప్రతి సినిమాతో మంచి విజయాన్ని సాధించడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ లెవల్ కి వెళ్ళిపోయిందనే చెప్పాలి…
సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం తనదైన రీతిలోసత్తా చాటుకున్న ఒక దర్శకుడు ప్రస్తుతం ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ కొన్ని కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే ‘గ్యాంగ్స్ అఫ్ వశీపూర్’ లాంటి సినిమాలను తీసిన అనురాగ్ కశ్యప్ విశేషం… గత కొన్ని రోజుల నుంచి ఆయన సినిమాలను డైరెక్ట్ చేయకుండా గా నటుడిగా మారి తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన మరోసారి డైరెక్షన్ చేయాలని అనుకున్నా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఒక్కరు సినిమా చేయాలని అనుకోవడం లేదట. కేవలం 600 కోట్ల నుంచి 800 కోట్ల వరకు కలెక్షన్లను వచ్చే సినిమాలను మాత్రమే చేయాలని వాళ్ళు అనుకోవడంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అంత కమర్షియల్ గా అయిపోయిందని మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేయాలని అనుకున్నప్పటికి ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రావడం లేదంటూ ఆయన వాపోయాడు. అందువల్లే అతను బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసి సౌత్ ఇండస్ట్రీ లోకి వెళ్లి అక్కడ సినిమాలు చేసుకుంటానని చెప్పడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Also Read : ఈ స్టార్ డైరెక్టర్ తీసిన రెండు సినిమాలు మంచి విజయాలను సాధించాయి..అయిన 10 ఏళ్లలో 2 సినిమాలు మాత్రమే చేశాడా..?
మరి తను నటుడుగా కూడా రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ‘మహారాజా ‘ సినిమాలో అనురాగ్ కశ్యప్ విలన్ గా నటించి ప్రతి ఒక్కరిని మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఆయనకు మరికొన్ని సినిమాల్లో కూడా నటుడిగా నటించే అవకాశాలైతే వస్తున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే ఇటు సినిమాలు చేసుకుంటూ నటుడిగా దర్శకుడిగా రాణించాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక దానికోసం ఆయన సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఎంచుకోవడం నిజంగా బాలీవుడ్ వాళ్లను ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి. నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది.
ప్రతి స్టార్ హీరో కూడా భారీ సక్సెస్ ని సాధించడంలో దారుణంగా విఫలమవుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ సౌత్ సినిమాల వైపే ఎక్కువ దృష్టిని పెడుతున్నాడు. ఇక ఇక్కడి హీరోలతోనే సినిమాలను చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే సౌత్ లో తన సినిమాల ద్వారా తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…