Tax: దేశంలో డబ్బు సంపాదించిన ప్రతీ వ్యక్తి పన్ను (Tax) అనేది తప్పకుండా కట్టాలి. పన్ను అనేది ఒక బాధ్యత. డబ్బు సంపాదించిన ప్రతీ ఒక్కరూ కూడా దేశంలో పన్ను చెల్లించాల్సిందే. అయితే పన్నులో చాలా రకాలు ఉంటాయి. ఇంటి పన్ను (House Tax), ఆదాయపు పన్ను ఇలా ఎన్నో ఉన్నాయి. పేదవాడి నుంచి ధనవంతుడు వరకు అందరూ కూడా పన్ను కట్టాలి. ఒకవేళ పన్ను కట్టకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటారు. పన్ను కట్టడానికి ఒక గడువు ఉంటుంది. ఆ గడువులోకా కట్టకపోతే తప్పకుండా కూడా చర్యలు తీసుకుంటారు. అయితే మన దేశంలో పన్ను కట్టకపోతే శిక్ష కూడా పడుతుంది. అసలు ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పన్ను కట్టడానికి ఓ గడువు తేదీ ఉంటుంది. మీ మొత్తం ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే జరిమానా రూ. 5,000 విధిస్తారు. అదే రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే రూ.1000 జరిమానా విధిస్తారు. రిటర్న్‌లు దాఖలు చేయడంలో ఆలస్యం అయితే సెక్షన్ 234A ప్రకారం నెలకు ఒక శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. అలాగే సెక్షన్ 156 ప్రకారం ఆదాయపు పన్ను శాఖ పన్ను డిమాండు కోసం నోటీసులు కూడా జారీ చేస్తుంది. ఆ గడువు తేదీలోకా చెల్లించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. కావాలనే పన్ను కట్టకుండా తప్పించుకుంటే మాత్రం సెక్షన్ 270A, 276CC ప్రకారం చర్యలు తీసుకుంటారు. 50 శాతం నుంచి 200 శాతం వరకు జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. అలాగే మీ ఆస్తులు, వాహనాలు కూడా స్వాధీనం చేసుకుంటారు.
ఉద్దేశపూర్వకంగానే పన్ను కట్టకపోతే మాత్రం అది క్రెడిట్‌పైన ప్రభావం చూపిస్తుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేయడానికి వీలు కుదరదు. పాస్‌పోర్ట్ జారీని కూడా రద్దు చేస్తుంది. ఆ తర్వాత కోర్టు కేసులు కూడా అవుతాయి. దీంతో భారీ జరిమానాలు ఉండటంతో పాటు మూడు నెలల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ గడువు తేదీకి పన్ను కట్టండి. లేకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.