Ureters: ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీలో (Kidney Issues) సమస్యలతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల (Food Habits) వల్ల చాలా మంది ఇలాంటి అనారోగ్య సమస్యలతో (Health Issues) ఇబ్బంది పడుతున్నారు. బాడీకి సరిపడా వాటర్ (Water) తీసుకోకపోయినా, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా కూడా కిడ్నీలో రాళ్లు (Kidney stones) ఏర్పడతాయి. అయితే మనలో చాలా మందికి కిడ్నీలో రాళ్ల గురించి తెలుసు. కానీ మూత్రాశయంలో రాయిలు (Stones) అంటే చాలా మందికి తెలియదు. కొందరికి మూత్ర విసర్జనలో రాయిలు ఏర్పడుతాయి. ఆ సమయంలో ద్రవ్యరాశి మూత్రపిండాలను మూత్రాశయానికి కలిపే ట్యూబ్ (Tube) లాంటి నిర్మాణాలకు వెళ్తుంది. దీన్నే యూరేటర్స్ (Ureter) అని అంటారు. ఇది మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఈ యూరేటర్స్ (Ureter) అనేది చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ వస్తే వెంటనే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యూరేటర్స్ (Ureter) అనేవి అధిక కాల్షియం, అధిక యూరిక్ యాసిడ్, అధిక స్థాయి ఆక్సలేట్, తక్కువ స్థాయి సిట్రేట్ వంటి వాటి వల్ల వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ యురేటర్స్ అనేది కుటుంబంలో ఎవరికైనా వంశపారంపర్యంగా కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అంటువ్యాధులు, కిడ్నీ వ్యాధి, మధుమేహం, హైపో థైరాయిడిజం, ఊబకాయం, అధిక శరీర ద్రవ్యరాశి సూచిక, మూత్ర విసర్జన, కాల్షియం ఆధారిత యాంటాసిడ్లు, కొన్ని యాంటీ బయోటిక్స్, రెట్రోవైరల్ మందుల వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యురేటర్స్ వస్తే మూత్రాశయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాగే వికారం, వాంతులు, మూత్రంలో రక్తం రావడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట రావడం వంటి లక్షణాలు అన్ని కనిపిస్తాయి. వీటిని తగ్గించడానికి ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అలాగే బచ్చలి కూర, బీన్స్ గింజలు తినాలి. వీటితో పాటు సిట్రస్ పండ్లు తీసుకోవాలి. కొందరికి ఇది పుట్టుకతోనే వస్తుంది. మరికొందరికి ఇది జన్యుపరమైన లోపాల వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యను తగ్గించుకోవాలంటే మాత్రం ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవాలి. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, కాల్షియం వంటివి ఉండే ఫుడ్స్ తినాలి. అలాగే పండ్ల జ్యూస్‌లు, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. డైలీ వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల కొంత వరకు ఈ సమస్యను తగ్గించవచ్చు. కొందరు మూత్ర విసర్జన వచ్చిన వెంటనే చేయకుండా ఆలస్యం చేస్తుంటారు. ఇలాంటి వారికి సమస్య ఎక్కువ అవుతుంది. ఇలా కాకుండా వచ్చిన వెంటనే వెళ్లడం అలవాటు చేసుకుంటే కొంత వరకు సమస్య క్లియర్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.