Nexon Top Sales: భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. కొందరు సొంత అవసరాల కోసం.. మరికొందరు కార్యాలయాల పనుల కోసం వెహికల్స్ ను కొనుగోలు చేస్తున్నారు. అయితే నవంబర్ నెల 2025 కార్ల అమ్మకాల లిస్టును రిలీజ్ చేశారు. వీటిలో అత్యధికంగా టాటా కంపెనీకి చెందిన Nexon అత్యధికంగా 22 వేల యూనిట్లు విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా ఇదే కారు నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ కారు 46 శాతం ఎక్కువగా విగ్రహాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే నవంబర్ నెలలో మరే కార్లు టాప్ లిస్టులో ఉన్నాయో చూద్దాం..
నవంబర్ నెలలో మొత్తం అమ్మకాల్లో ఎక్కువగా SUV వెహికల్స్ విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కంపాక్ట్, మిడిల్ SUV వెహికల్స్ కు ప్రాధాన్యతను ఇచ్చారు. ఇవి SUV లతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ వృద్ధి మాత్రం 50% వరకు నమోదయింది. నవంబర్ నెల మొత్తంలో టాటా కంపెనీకి చెందిన Nexon 22,434 యూనిట్ల విక్రయాలతో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 46% వృద్ధి చెందింది. SUV వేరియంట్ ఇది బెస్ట్ అని చాలామంది కొనుగోలు చేశారు. ఈ మోడల్ తర్వాత మారుతి సుజుకి చెందిన డిజైర్ 21,082 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ మాడల్ 79% వృద్ధి సాధించడం విశేషం. అలాగే ఇదే కంపెనీకి చెందిన స్విఫ్ట్ 19,733 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అయితే మారుతి కంపెనీకి చెందిన రెండు కార్లు కాంపాక్ట్ వేరియంట్ కావడం విశేషం.
ఆ తర్వాత టాటా కంపెనీకి చెందిన పంచ్ 18,753 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇది 21వ శాతం వృద్ధి సాధించింది హుందాయి కంపెనీకి చెందిన క్రెటా 17,344 యూనిట్లు అమ్మి ఐదో స్థానంలో నిలిచింది. 8వ స్థానంలో మరోసారి మారుతి కంపెనీకి చెందిన మోడల్ నిలిచాయి. వీటిలో ఎర్టిగా 16,197 యూనిట్లు, వ్యాగన్ఆర్ 14,619 కార్లను విక్రయించింది. ఇదే కంపెనీకి చెందిన ఈకో వెహికల్ కూడా 13,200 యూనిట్ల విగ్రహాలు నమోదు చేసుకుంది.
ఇలా టాప్ టెన్ వరకు లో చూస్తే మారుతి కంపెనీకి చెందిన కార్లు మొదటి స్థానాల్లో లేనప్పటికీ అత్యధికంగా ఈ కార్లు . అయితే మహీంద్రా కంపెనీకి చెందిన ఐదు మోడల్స్.. అన్ని SUV లు టాప్ 20 లో నమోదు చేసుకున్నాయి. చాలామంది మహేంద్ర కార్ల కోసం ఎగబడుతూ ఉంటారు. అయితే వీటి ధర ఎక్కువగా ఉండడంతో కొంతమంది మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. టాప్ టెన్ లో ఈ కంపెనీ లేనప్పటికీ.. మహీంద్రా అమ్మకాలు తగ్గలేదు అని తెలుసుకోవచ్చు.