Bigg Boss 9 Telugu Demon Pavan: ఊహించని మలుపులు, బంధాలు, అనుబంధాలు మధ్య ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా సాగిన బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మరో వారం లో ప్రతీ కంటెస్టెంట్ ని తమ కుటుంబ సభ్యులు లాగా భావించిన ఆడియన్స్, ఆ కంటెస్టెంట్స్ ని బాగా మిస్ అవ్వబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో టైటిల్ విన్నింగ్ రేస్ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మరియు తనూజ మధ్య మాత్రమే ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ గెలవబోతున్నారు. మరి టాప్ 5 గా ఎవరెవరు ఉండబోతున్నారు అనే దానిపై ఇంకా స్పష్టమైన క్లారిటీ రావడం లేదు. అయితే టాప్ 5 స్థానం లో కచ్చితంగా ఉండేందుకు అర్హత ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు డిమోన్ పవన్. అగ్నిపరీక్ష షో ద్వారా సామాన్యుల క్యాటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన డిమోన్ పవన్ , తన అద్భుతమైన ఆట తో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు.
రీతూ చౌదరి తో లవ్ ట్రాక్ కారణంగా కాస్త ఆయన గ్రాఫ్ గాడి తప్పినప్పటికీ, ఫిజికల్ టాస్కులు ఎదురైనా ప్రతీసారీ తన అద్భుతమైన టాలెంట్ ని చూపిస్తూ, నాతో ఎవ్వరూ పోటీ పడలేరు అనేలా బలంగా నిల్చున్నాడు. ఇక రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యాక, ఇతనిలో ఫన్ యాంగిల్ ని ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇంతటి ఫన్ యాంగిల్ ని తనలో దాచుకొని, ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు?, ఒకవేళ మొదటి రోజు నుండి డిమోన్ పవన్ ఇదే యాంగిల్ లో కొనసాగి ఉండుంటే, కచ్చితంగా నేడు టైటిల్ రేస్ లో ఉండేవాడు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈ వారం డిమోన్ పవన్ లేకుంటే ఎంటర్టైన్మెంట్ హౌస్ లో లేదు. సాధారణంగా ఇమ్మానుయేల్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ఉంటాడు. కానీ ఈసారి ఇమ్మానుయేల్ స్థానం లోకి డిమోన్ పవన్ వచ్చాడు.
అయితే డిమోన్ పవన్ కి ఈ వారం అన్యాయం చేయబోతున్నారా..? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. వాళ్లకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, ప్రస్తుతం డిమోన్ పవన్ డేంజర్ జోన్ లో కొనసాగుతున్నాడు. అందరూ అతనికి భారీ ఓటింగ్ పడుతుందని అనుకుంటున్నారు కానీ, వాస్తవానికి ఆ రేంజ్ ఓటింగ్ మాత్రం పడడం లేదట. ఇతనికంటే భరణి, సంజన ముందంజ లో ఉన్నట్టు తెలుస్తోంది. సరైన పీఆర్ టీం లేకపోవడం వల్లే, డిమోన్ పవన్ కి అనుకున్నంత రేంజ్ లో ఓటింగ్ పడడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే సుమన్ శెట్టి తో పాటు, డిమోన్ పవన్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.