Tata Nexon EV
Tata Nexon EV : టాటా నెక్సాన్ EV భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. దీనిని రోడ్ల మీద అత్యధిక సంఖ్యలో చూడవచ్చు. ఈ కారు చాలా కాలంగా భారత మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు మునుపటి తరం మోడల్ కూడా ఇప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే, టాటా కర్వ్ ఈవీ రాకతో ఈ కారుకు ఆదరణ కొంత తగ్గింది. కానీ ఇప్పటికీ ఈ కారుకు మంచి డిమాండ్ కొనసాగుతుంది. టాటా నెక్సాన్ ఈవీ అనేక పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తుంది. ఈ కారులో ఫ్రంక్, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి. ఈ కారులోని ఫీచర్ల కారణంగా దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కారులో ఉన్న ఫీచర్లు కారు కొనుగోలుదారులను బాగా ఆకర్షించాయి.
టాటా నెక్సాన్ టెస్టింగ్: టాటా నెక్సాన్ ఈవీని ప్రముఖ మీడియా సంస్థ రెండు వారాల పాటు పరీక్షించారు. ఈ కారు 290 కిలోమీటర్లకు మాత్రమే పరిమితమై కనిపించినా, అనుభవం ప్రకారం ఈ కారు 300 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణం చేయగలిగింది. ఢిల్లీ వీధుల్లో భారత్ మొబిలిటీ ఈవెంట్ జరుగుతున్నప్పుడు కారు డ్రైవ్ చేసి ఈ ఫలితాలను తెలుసుకున్నారు.
టాటా నెక్సాన్ ఈవీ రేంజ్
టాటా నెక్సాన్ ఈవీ 45 kWh బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌తో కారు 489 కి.మీ పరిధిని అందిస్తుందని పేర్కొంది, ఇది ఈ కారు 40.5 kWh మోడల్ కంటే కొంచెం ఎక్కువ. టాటా ఈ ఎలక్ట్రిక్ కారు వాస్తవ పరిధి గురించి చెప్పాలంటే.. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 350-370 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
ఈ కారును టెస్టింగ్ చేస్తున్న సమయంలో భారీగా జనాలు గుమిగూడారు. దీని కారణంగా రోడ్లపై చాలా ట్రాఫిక్ ఉంది. ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేస్తే, డిస్ప్లే 290 కి.మీ.ల పరిధిని చూపిస్తుంది, కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈ కారు 300 కి.మీ.ల దూరాన్ని సులభంగా కవర్ చేస్తుంది.
టాటా నెక్సాన్ ఈవీ టెస్టింగ్ సమయంలో ఈ కారుతో 350 కిలోమీటర్లు ప్రయాణించామని మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ వాహనం 40.5 kWh వేరియంట్ 270 కి.మీ దూరాన్ని కవర్ చేసింది. కారును ఎకో మోడ్‌లో నడిపారు. వన్-పెడల్ డ్రైవింగ్ కోసం లెవల్ 2 రీజెన్, లెవల్ 3ని ఉపయోగించాం.
టాటా నెక్సాన్ ఈవీ ధర
టాటా నెక్సాన్ EV ధర రూ. 13.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది . దాని టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 17 లక్షలు. ఈ కారు ధర, ఫీచర్లు, పనితీరును పరిశీలించిన తర్వాత, దీనిని బెస్ట్ కారుగా పేర్కొవచ్చు. ఈ వాహనం రియల్ రేంజ్ ఈ ధర పరిధిలోని ఇతర ఎలక్ట్రిక్ కార్ల కంటే మెరుగ్గా ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tata nexon ev has the tata nexon ev passed the test does it really give the range that the company says
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com