Tata Nexon: చాలామంది కొత్త కారు కొనుగోలు చేస్తున్నప్పుడు.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. మార్కెట్లో ఏ మోడల్స్ కు డిమాండ్ ఉంది? జనం ఏ మోడల్స్ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు? వంటి అంశాలను లోతుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇప్పటి కాలంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్లో టాటా మోటార్స్ తన దూకుడు కొనసాగిస్తోంది. గత నెలలో జరిగిన వాహనాల విక్రయాలను పరిశీలిస్తే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
టాటా మోటార్స్ తన ప్రస్థానాన్ని ఘనంగా చాటుతోంది. మారుతి సుజుకి, క్రెటా వంటి వాటికి తిరుగులేని స్థాయిలో పోటీ ఇచ్చి.. శిఖర స్థానంలో నిలిచింది. గత నెలలో ఎక్కువగా అమ్ముడుపోయిన టాప్ టెన్ ఆర్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. ఈ నెలలో సేల్స్ విభాగంలో టాటా నెక్సన్ అగ్రస్థానంలో ఉంది. మారుతి డిజైర్, హ్యుందాయ్ క్రెటా వంటి పాపులర్ మోడల్స్ కూడా తర్వాత ఇస్తానులకు వెళ్లిపోయాయి. టాటా కంపెనీ గత నెల నెక్సాన్ మోడల్ లో 19,430 యూనిట్లు అమ్మింది. రెండవ స్థానంలో మారుతి సుజుకి డిజైర్ కొనసాగుతోంది. 19,326 యూనిట్ల అమ్మకాలతో ఇది రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో టాటా పంచ్ ఉంది. ఈ మోడల్ లో 18,748 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రెటా లో కూడా 17,938 యూనిట్లు రోడ్డెక్కాయ్. ఐదో స్థానంలో మారుతి సుజుకి బ్రేజ్జా మోడల్ ఉంది. ఈ మోడల్ 17,863 ఈనట్లు అమ్ముడుపోయాయి.
ఈ జాబితాను చూసుకుంటే తొలి 5 స్థానాలలో 4 ఎస్ యూవీలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టాప్ 10 జాబితాను పరిశీలిస్తే మారుతి సుజుకి ఎర్టిగా 17,807 యూనిట్లతో ఆరవ స్థానంలో.. మారుతి వ్యాగన్ ఆర్ 14,885, మారుతి స్విఫ్ట్ 14,833, మహేంద్ర స్కార్పియో 14,665, మారుతి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలేనో 14,632 యూనిట్లతో తర్వాత స్థానాలలో కొనసాగుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం టాటా మోటార్స్, మారుతి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది.