https://oktelugu.com/

కారు కొనాలనుకునే వాళ్లకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.4000తో కొత్త కారు మీ సొంతం!

మనలో చాలామంది కొత్త కారు కొనాలని అనుకుంటూ ఉంటారు. అయితే చేతిలో డబ్బులు లేకపోవడం, ఇతర కారణాల వల్ల కొత్త కారును కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే నెలకు కేవలం 4000 రూపాయలు ఈఎంఐల రూపంలో చెల్లించి కొత్త కారును సులభంగా సొంతం చేసుకోవచ్చు. టాటా మోటార్స్ సంస్థ కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. టాటా మోటార్స్ తెచ్చిన ఆఫర్ వల్ల తక్కువ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2020 / 05:40 PM IST
    Follow us on


    మనలో చాలామంది కొత్త కారు కొనాలని అనుకుంటూ ఉంటారు. అయితే చేతిలో డబ్బులు లేకపోవడం, ఇతర కారణాల వల్ల కొత్త కారును కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే నెలకు కేవలం 4000 రూపాయలు ఈఎంఐల రూపంలో చెల్లించి కొత్త కారును సులభంగా సొంతం చేసుకోవచ్చు. టాటా మోటార్స్ సంస్థ కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.

    టాటా మోటార్స్ తెచ్చిన ఆఫర్ వల్ల తక్కువ వేతనం పొందే వాళ్లు కూడా సులభంగా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. టాటా మోటార్స్ టీగోర్ కారు కొనుగోలు చేసేవాళ్లకు ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఈ కారు ధర 5.39 లక్షల రూపాయలు కాగా నెలకు 4,112 రూపాయల చొప్పున సులభ వాయిదాలలో చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు. ఈ కారుకు మన దేశంలో సేఫ్టెస్ట్ సెడాన్ కారుగా గుర్తింపు ఉంది.

    ఈ కారులో డ్యూయెల్ పాత్ సస్పెన్షన్ సిస్టమ్ ఉండటం వల్ల ఈ కారులో ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. బీఎస్ 6 పెట్రోల్ ఇంజిన్ తో నడిచే ఈ కారు 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ తో పాటు 5 స్పీడ్ మ్యానువల్ ఆప్షన్లతో కస్టమర్లకు అందుబాటులో ఉంది. నాలుగు ఆప్షన్లలో టాటా మోటార్స్ సంస్థ టిగోర్ కారును కస్టమర్లకు అందిస్తోంది.

    టిగోర్ ఎక్స్‌జెడ్, టిగోర్ ఎక్స్‌జెడ్ ప్లస్, టిగోర్ ఎక్స్‌ఈ, టిగోర్ ఎక్స్ఎం అందుబాటులో ఉండగా వీటి ధర 5.39 లక్షల రూపాయల నుంచి 6.99 లక్షల రూపాయల మధ్యలో ఉంది. తక్కువ మొత్తం ఈఎంఐ రూపంలో చెల్లించి కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో కారు కొనుగోలు చేయడం వల్ల తక్కువ ఖర్చుతో కారు సొంతమవుతుంది.