https://oktelugu.com/

అక్కినేని ఫ్యామిలీలో.. అక్కినేని యష్ !

అక్కినేని ఫ్యామిలీ హీరోలు అనగానే నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్‌, సుమంత్, సుశాంత్ గుర్తుకు వస్తారు. ఇప్పుడు వీరి లిస్ట్ లో మరో పేరు వచ్చి చేరింది. ఆ పేరే య‌ష్ అక్కినేని.. ఈ పేరు వినగానే ఎవరు అంటూ నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. అసలు ఈ పేరు ఎప్పుడు విన‌లేదు కదా, ఇంతకీ ఎవరు ఈ యష్ ? అసలు స‌డెన్‌ గా ఎక్క‌డ నుండి వ‌చ్చాడు ఇతను ? అని అనుకుంటున్నారా..? మ‌రి స‌మంత […]

Written By:
  • admin
  • , Updated On : November 24, 2020 / 05:34 PM IST
    Follow us on


    అక్కినేని ఫ్యామిలీ హీరోలు అనగానే నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్‌, సుమంత్, సుశాంత్ గుర్తుకు వస్తారు. ఇప్పుడు వీరి లిస్ట్ లో మరో పేరు వచ్చి చేరింది. ఆ పేరే య‌ష్ అక్కినేని.. ఈ పేరు వినగానే ఎవరు అంటూ నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. అసలు ఈ పేరు ఎప్పుడు విన‌లేదు కదా, ఇంతకీ ఎవరు ఈ యష్ ? అసలు స‌డెన్‌ గా ఎక్క‌డ నుండి వ‌చ్చాడు ఇతను ? అని అనుకుంటున్నారా..? మ‌రి స‌మంత రివీల్ చేసిన ఈ పేరు గురించి ఆ మాత్రం ఆలోచించ‌క‌పోతే ఎలా? అందుకే స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బేబి బాయ్ రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. వాడికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు అని కామెంట్ పెట్టిన వెంటనే ఈ పోస్ట్ తెగ వైరల్ అయింది.

    Also Read: ‘ఆదిపురుష్’: రామాయణాన్ని టచ్ చేస్తే మతవివాదాలు తప్పవా?

    కాగా స‌మంత పోస్ట్ చేసింది త‌న పెంపుడు కుక్క య‌ష్ గురించి. యష్ ఈ రోజు రెండ‌వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా అంద‌మైన ఫొటో ఒకటి షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. అలాగే గ‌తంలోను య‌ష్ ‌కు సంబంధించి చాలా ఫొటోలను సమంత షేర్ చేసి.. యష్ తో ఉన్న తన బంధాన్ని ఈ రకంగా బయటపెట్టింది. ఇక సమంత ఎప్పుడూ యష్ తో స‌ర‌దాగా గ‌డుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక నిన్న సమంత భ‌ర్త నాగ చైత‌న్య పుట్టిన రోజు కావడంతో.. ఈ క్యూట్ క‌పుల్ ఇద్దరూ మాల్దీవుల‌కి వెళ్లారు. అక్క‌డ దిగిన అడ‌పాద‌డ‌పా ఫోటోల‌ని ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తూ ఉంది.

    Also Read: అమీర్ ఖాన్, మహేష్.. ఇద్దరు స్టార్ లను కలుపబోతున్న రాజమౌళి?

    ప్రస్తుతం ఈ భార్య భర్తలు ఇద్దరూ మాల్దీవుల్లోని ఉత్తరాదిన ఉన్న ఓ ద్వీపంలో ఉన్నారట. సమంత అక్కడ స్కూబా డైవింగ్‌ కూడా చేసింది.. దానికి సంబంధించిన ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ప్ర‌స్తుతం ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో పాటు సామ్ జామ్ అనే షోని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత నంద‌ని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా కూడా సమంత చేయడానికి ప్లాన్ చేసుకుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్