https://oktelugu.com/

Instant Loan : ఇన్‎స్టంట్ లోన్ తీసుకుంటున్నారా?.. అయితే..!!

తక్కువ సమయానికి తీసుకునే రుణాలకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. దీన్ని సకాలంలో తీర్చకపోతే వడ్డీ భారం అధికమవుతుంది. కావున రూ.20 వేలకు మించి రుణాన్ని తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే 90 రోజులకు తక్కువ వ్యవధికి తీసుకోవద్దని తెలియజేస్తున్నారు. ఒక్కోసారి తీసుకున్న రుణాన్ని తీర్చడానికి మరో లోన్ తీసుకోవడం వంటివి చేస్తే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 5, 2024 / 04:56 PM IST
    Follow us on

    Instant Loan : ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఇది వరకు ఎంతో సమయం పట్టేది. ఎన్నో కాగితాలు సమర్పించిన తరువాత కూడా రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే మారుతున్న కాలంలో రుణాల తీరూ కూడా మారిపోయింది. కేవలం ఒక్క క్లిక్ తోనే ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా క్షణాల్లో లోన్ తీసుకునే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ విధంగా ఇన్‎స్టంట్ లోన్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

    అవసరం కదా అని చాలా మంది వడ్డీ రేటు కనుక్కొని వెంటనే ఓకే చెప్పేస్తుంటారు. కానీ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    ప్రస్తుతం ఫోన్ లో రుణాలు ఇస్తామంటూ ఫిన్ టెక్ యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే మీలో ఎవరైనా లోన్ తీసుకోవాలనుకుంటే కనుక లోన్ యాప్స్ ఆర్బీఐ అనుమతిని పొంది ఉన్నాయా? లేదా ? అన్నది చూసుకోవాలి. అదేవిధంగా ఏఏ బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాయో తెలుసుకోవాలి. గుర్తింపు లేని సంస్థల నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ లోన్స్ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చే ఛాన్స్ ఉంది.

    తక్కువ సమయానికి తీసుకునే రుణాలకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. దీన్ని సకాలంలో తీర్చకపోతే వడ్డీ భారం అధికమవుతుంది. కావున రూ.20 వేలకు మించి రుణాన్ని తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే 90 రోజులకు తక్కువ వ్యవధికి తీసుకోవద్దని తెలియజేస్తున్నారు. ఒక్కోసారి తీసుకున్న రుణాన్ని తీర్చడానికి మరో లోన్ తీసుకోవడం వంటివి చేస్తే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుంది.

    అందుకనే అవసరంతో పాటు తీర్చే సామర్థ్యం రెండింటినీ చూసుకుని ఎంత లోన్ తీసుకోవాలనే నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా లోన్ కోసం ఒకేసారి రెండు, మూడు సంస్థలకు అప్లయ్ చేయకూడదు. దీని వలన రుణ అర్హతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా అప్పు తీసుకునే సమయంలో అప్లికేషన్ తో పాటు రుణ ఒప్పందాన్నీ కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. నిబంధనలు పూర్తిగా తెలుసుకున్న తరువాతే లోన్ పై నిర్ణయం తీసుకోవాలి.