https://oktelugu.com/

Tollywood: ఈ బ్లాక్ బస్టర్ మూవీల టైటిల్స్ ముందుగా ఏం అనుకున్నారో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా పోకిరి. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ ను సాధించింది. అయితే ఈ సినిమాకు ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ చివరకు పోకిరి టైటిల్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 5, 2024 / 04:47 PM IST

    Tollywood

    Follow us on

    Tollywood: కొన్ని సినిమాలకు ముందుగా ఒక హీరోను అనుకుంటారు. కానీ కుదరకుండా మరొక హీరోతో తెరకెక్కిస్తారు. అంతేకాదు సినిమా టైటిల్ కూడా ఒకటి అనుకుంటారు. కానీ ఆ తర్వాత మరొక టైటిల్ ను ప్రకటిస్తారు. ఇక మాస్ దర్శకుడు పూరిజగన్నాద్ సినిమాలు కూడా ముందుగా ఒక టైటిల్ ను అనుకొని మరొక టైటిల్ తో కంటిన్యూ అయ్యాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అనుకుంటున్నారా?

    పోకిరి.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా పోకిరి. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ ను సాధించింది. అయితే ఈ సినిమాకు ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ చివరకు పోకిరి టైటిల్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

    బద్రి.. పవన్ కళ్యాణ్ హీరోగా రేణుదేశాయ్, అమీషా పటేల్ లు హీరోయిన్ లుగా తెరకెక్కిన సినిమా బద్రి. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్. ముందుగా ఈ సినిమాకు చెలి టైటిల్ అనుకున్నారు. టైటిల్ క్లాస్ అవుతుందని బద్రిగా మార్చారు పూరి జగన్నాథ్.

    చిరుత.. రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేస్తూ చిరుత సినిమాను తెరకెక్కించారు పూరి. ఈ సినిమాకు ముందుగా కుర్రాడు అనే టైటిల్ అనుకున్నారట పూరి. అంతేకాదు లో క్లాస్ ఏరియా అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారట. కానీ చిరంజీవి కుమారుడికి ఈ టైటిల్ బాగోదు అని చిరుత అనే టైటిల్ ఫిక్స్ చేశారట.

    ఆంధ్రావాలా.. ఎన్టీఆర్, పూరి కాంబినేషన్ లో వచ్చిన ఆంధ్రావాలా సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే అందరిని నిరాశ పరిచింది. ఇక ఈ సినిమాకు మొదటి కబ్జా అనే టైటిల్ అనుకున్నారు. కానీ చివరకు ఆంధ్రావాలా అనే టైటిల్ ను ఫైనల్ చేశారు పూరి.

    ఈ సినిమాలు అన్నీ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినవే.. ఇక ఈయన సినిమాలు ముందుగా ఒక టైటిల్ తో ఫిక్స్ అయి ఆ తర్వాత మరో టైటిల్ తో ఫైనల్ అయ్యాయి.