Ram Charan Game Changer: మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న రామ్ చరణ్ తన మొదటి సినిమా నుంచి ఇప్పుడు వచ్చే గేమ్ చెంజర్(Game Changer) సినిమా వరకు అన్ని సినిమాల్లో వైవిధ్యాన్ని కనబరుస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చిన సినిమాలు ఏవీ అంటే చిరుత, మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ సినిమాలనే చెప్పాలి.
ఇక ఆయనకి కెరియర్ లో నటనపరంగా కానీ సక్సెస్ ల పరంగా కానీ ఈ సినిమాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసి ఇప్పటికి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇంకా ఈ సినిమా నుంచి ఒక్క గ్లిమ్స్ గాని, ఒక టీజర్ గాని ఏది రిలీజ్ అవ్వలేదు. ఇక ఇప్పటి వరకు ఒక్క ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా సోషల్ మీడియాలో రామ్ చరణ్ హెలికాప్టర్ మీద నుంచి దిగే ఒక ఫోటో లీకైంది.
అయితే ఈ ఫోటో చూసిన చరణ్ అభిమానులు ఇది ఈ సినిమాలో వచ్చే ఇంట్రాడక్షన్ సీన్ కి సంబంధించిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో ఆ న్యూస్ ను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మరొక న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే ఈ సినిమా ఇంటర్వెల్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉండబోతుందట…
అయితే ఈ సినిమాలో ఇద్దరూ రామ్ చరణ్ లు ఉండగా అందులో ఒకరంటే ఒకరికి కోపంగా ఉంటుందట. ఇక దాంతో ఇంటర్వెల్ లో ఒక రామ్ చరణ్ వచ్చి మరొక రామ్ చరణ్ ను షూట్ చేస్తాడట. దాంతో ఈ సినిమాకి ఇంటర్వెల్ కార్డ్ పడుతుందట. అయితే వీళ్లిద్దరు మొదట శత్రువులుగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కలిసిపోతారట. అయితే వీళ్లిద్దరి మధ్య గొడవ ఏంటి అనే విషయాన్ని సెకండ్ హాఫ్ లో చూపిస్తారట. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ తొందరలోనే ఈ సినిమా నుంచి టీజర్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు…