సొంత కంపెనీ కారుతో పోటీ పడుతున్న స్విప్ట్..

స్విప్ట్ కంటే బాలెనో విశాలమైన స్పేస్ ను కలిగి ఉంటుంది. స్విప్ట్ లో సీఎన్ జీ లేదు. కానీ బాలెనోలో ఉంది. ఇలా ఫీచర్లతో పాటు కొన్ని ఆప్షనల్లో తేడాలు ఉండడంతో రెండు కార్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Written By: Chai Muchhata, Updated On : May 21, 2024 2:22 pm

maruthi baleno swift cars

Follow us on

maruthi baleno swift carsసాధారణంగా రెండు కంపెనీల కార్ల మధ్య పోటీ ఉంటుంది. ఒక కారు కాదని, మరో కంపెనీకి చెందిన కారును కొనుగోలు చేయడం ద్వారా అమ్మకాల్లో తేడాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒకే కంపెనీకి చెందిన రెండు కార్లు పోటీ పడుతున్నాయి. ఒకటికి మించి మరొకటి అమ్మకాలు విపరీతంగా జరుపుకుంటున్నాయి. మిగతా కార్లతో పోలిస్తే ఈ రెండు కార్లు మాత్రమే అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవి? ఇవి ఏ కంపెనీకి చెందినవి?

దేశీయ కార్ల మార్కెట్లో మారుతి కంపెనీ అగ్రస్థానంలో ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అన్నిరకాల మోడళ్లను మారుతి పలు మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మారుతి నుంచి రిలీజ్ అయిన కార్లలో స్విప్ట్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. స్విప్ట్ కొన్ని మార్పులు చేసుకొని మే 9న రిలీజ్ అయింది. ఈ కారు రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు ఈ స్విప్ట్.. ఇదే కంపెనీకి చెందిన బాలెనోతో పోటీ పడుతోంది.

మారుతి నుంచి రిలీజ్ అయిన కొత్త స్విప్ట్ లో ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో హెడ్ ల్యాంపులు, బంపర్ల నుంచి డోర్ హ్యాండిళ్లు కొత్త గా సెట్ చేశారు. ఎల్ ఈడీ ఫాగ్ ల్యాంప్లు, ఎల్ ఈడీ లైట్ మ్యాప్ లు ఉన్నాయి. ఇది 1.2 లీటర్ నేచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇందులో Z సిరీస్ ఇంజిన్ ను ఏర్పాటు శారు. 80 బీహెచ్ పీ పవర్ తో 111 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి కొత్త స్విప్త్ 6.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

బాలెనో కారు 1.2 లీటర్ పెట్రోల్ 4 సిలిండన్ ఇంజిన్ ను కలిగి ఉంది. 88.5 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సీఎన్ జీ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్విప్ట్ మాదిరిగానే ఎల్ ఈడీ లైట్స్, మిగతా ఫీచర్స్ సమానంగా ఉన్నాయి. అయితే స్విప్ట్ కంటే బాలెనో విశాలమైన స్పేస్ ను కలిగి ఉంటుంది. స్విప్ట్ లో సీఎన్ జీ లేదు. కానీ బాలెనోలో ఉంది. ఇలా ఫీచర్లతో పాటు కొన్ని ఆప్షనల్లో తేడాలు ఉండడంతో రెండు కార్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.