India-Pakistan Trade: భారత్‌తో వాణిజ్యంపై సంచలన ప్రకటన చేసిన పాకిస్తాన్

ఢిల్లీ టు ఇస్లమాబాద్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత చెడిపోయాయి. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మరోసారి స్పందించారు.

Written By: Neelambaram, Updated On : May 21, 2024 2:27 pm

Trade with India suspended due to heavy duties

Follow us on

India-Pakistan Trade: పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ నట్లను భారత్ మరింత బిగించింది. పాక్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను 200 శాతంకు పైగా పెంచింది. దీన్ని 2019 నుంచి భారత ప్రభుత్వం అమలు చేసింది. భారత్ నిర్ణయంతో పాక్ సామగ్రికి ఇండియాలో మార్కెట్ తగ్గింది. దీంతో ఢిల్లీ టు ఇస్లమాబాద్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత చెడిపోయాయి. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మరోసారి స్పందించారు.

పాకిస్తాన్ దిగుమతులపై భారతదేశం 200 శాతం సుంకం విధించిందని, కాశ్మీర్ బస్సు సర్వీస్ ను నిలిపివేసిందని, తదితర విషయాలను ప్రస్తావిస్తూ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ రాత పూర్వకంగా అందజేసినట్లు ‘ది హిందూ’ తాజా నివేదిక వెల్లడించింది. పుల్వామా దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి వ్యాపారం. పాకిస్థాన్ పొరుగు దేశాలతో, ముఖ్యంగా భారత్‌తో వాణిజ్య సంబంధాల గురించి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ శాసన సభ్యురాలు షర్మిలా ఫరూఖీకి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ దార్ ఈ వ్యాఖ్య చేశారు.

భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునఃప్రారంభించడంలో ప్రణాళికల గురించి ప్రశ్నించినప్పుడు పాకిస్తాన్ భారత్ తో వ్యాపారం పునరుద్ధరించుకునేందుకు వ్యాపార సంఘం ఆసక్తిగానే ఉందని చెప్పిన మంత్రి ‘2019 నుంచి వాస్తవంగా ఉనికిలో లేని సంబంధాలను పునరుద్ధరించే ప్రణాళికలు ప్రస్తుతం లేవు’ అని బదులిచ్చారు.

2019, ఆగస్ట్ 5న భారత పార్లమెంటు ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఈ సంబంధాలు మరింత క్షీణించాయని దార్ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు రెండు దేశాల మధ్య చర్చలకు పూర్తిగా క్షీణింపజేసిందని, పాక్ దీనిపై కఠినంగా ఉందని ఆయన చెప్పారు. ముఖ్యంగా జమ్ము-కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు ‘అర్థవంతమైన చర్చల’రె పాకిస్తాన్ కోరుతుందని దార్ మళ్లీ నొక్కిచెప్పారు. శాంతి, సయోధ్య కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం న్యూఢిల్లీకి ప్రయోజనకరమని ముగించారు.

ఈ విషయంలో దార్ చెప్పినవి నమ్మశక్యంగా అనిపించడం లేదు. మొదటి నుంచి శాంతిని పాటిస్తుంది భారత్ మాత్రమే. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం ఆపితేనే భారత్ చర్చలకు వస్తుందని పదే పదే చెప్తూనే ఉంది. పొరుగున ఉన్న పాక్ తో శాంతియుతంగా కలిసి ఉండేందుకు సిద్ధంగా ఉన్న భారత్ పై పాక్ మాత్రం విషం చిమ్ముతూ ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంది.

రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు దశాబ్దాలుగా ఉద్రిక్తంగా ఉన్నాయి. కశ్మీర్ చుట్టూ రాజుకున్న ఘర్షణ, పాకిస్తాన్ ఉగ్రవాదం ఎగుమతిపై భారత్ ఎప్పుడూ ప్రపంచాన్ని హెచ్చరిస్తూనే ఉంటుంది.