Suzuki Summer Offer: వేసవి మధ్యకు వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే వాహనదారులకు సుజుకి మోటార్ సైకిల్ ఇండియా చల్లని కబురు చెప్పింది. తమ 2025 ఉత్పత్తులపై అదిరిపోయే సమ్మర్ ఆఫర్లను ప్రకటించింది. యాక్సెస్, ఎవెనిస్, బర్గ్‌మన్ స్ట్రీట్, జిక్సర్ ఎస్‌ఎఫ్, వి-స్ట్రోమ్ ఎస్‌ఎక్స్ వంటి పాపులర్ స్కూటర్లు, బైక్‌లపై క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో పాటు మరెన్నో ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ తగ్గింపులను సుజుకి తమ సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా వెల్లడించింది.
Also Read: 3 ఏళ్లలోనే తిరుగుముఖం..ఎర్టిగాకు పోటీ ఇవ్వలేకపోయిన కియా
టూ-వీలర్ తయారీదారు సుజుకి రూ.5,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. అంతేకాకుండా, సమ్మర్ ఆఫర్‌లో భాగంగా రూ.2,299 విలువైన 10 సంవత్సరాల వారంటీని పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ 10 సంవత్సరాల వారంటీ పథకంలో రెండు సంవత్సరాల ప్రామాణిక వారంటీతో పాటు 8 సంవత్సరాల పొడిగించిన వారంటీ కూడా ఉంటుంది.
వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు జపనీస్ బైక్ తయారీదారు IDFC ఫస్ట్ బ్యాంక్‌తో పార్టనర్ షిప్ తో నగదు ఆఫర్‌లను కూడా అందిస్తోంది. IDFC క్రెడిట్ కార్డ్‌తో స్కూటర్‌లను కొనుగోలు చేస్తే EMI చెల్లింపు పథకంపై 5 శాతం నుండి రూ.5,000 వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా, ఎటువంటి తనఖా లేకుండా ఉత్పత్తులపై 100 శాతం రుణం పొందే అవకాశం కూడా ఉంది. అయితే, ఈ ఆఫర్లు కొన్ని రూల్స్ లోబడి ఉంటాయని, వేర్వేరుగా ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ ఆఫర్ల గురించి తాజా సమాచారం కోసం సమీప డీలర్లను సంప్రదించవచ్చు.
సుజుకి యాక్సెస్ కంపెనీ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇది 3 వేరియంట్లు, 5కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్ట్ అయ్యే కన్సోల్‌తో మెరుగైన పనితీరు, అధిక మైలేజ్, సౌకర్యాన్ని అందిస్తుంది. రూ.83,800 ధరతో ఇది ఇప్పుడు యూరో 5+ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. అప్‌డేటెడ్ యాక్సెస్ 125 స్టాండర్డ్, స్పెషల్, రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో సాలిడ్ ఐస్ గ్రీన్, పెర్ల్ షైనీ బేజ్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2 వంటి ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.